https://oktelugu.com/

జీతం కోసం పనిచేయాలా? ఉద్యోగాలు ఎలా చేయాలి?

ప్రతి పరిశ్రమకు కొన్ని నిబంధనలు ఉంటాయి. పని చేసే ఉద్యోగులకు కూడా షరతులు విధిస్తారు. అవి మనం అనుసరించాలి. ఆచరించాలి. అప్పుడే కంపెనీ మనకు వేతనం ఇస్తుంది. కంపెనీ నియమ నిబంధనలు పాటిస్తూ తోటి ఉద్యోగులతో సఖ్యతగా ప్రవర్తిస్తూ.. నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతీ అన్నట్లుగా మన విధానం మెరుగుపరుచుకోవాలి. నైపుణ్యాలు పెంచుకోవాలి. పనిలో నాణ్యత ప్రదర్శించాలి. యజమాని మెప్పు పొందే విధంగా మన తీరును మార్చుకోవాలి. అప్పుడే మనకు సరైన గుర్తింపు వస్తుంది. […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 6, 2021 / 02:55 PM IST
    Follow us on

    ప్రతి పరిశ్రమకు కొన్ని నిబంధనలు ఉంటాయి. పని చేసే ఉద్యోగులకు కూడా షరతులు విధిస్తారు. అవి మనం అనుసరించాలి. ఆచరించాలి. అప్పుడే కంపెనీ మనకు వేతనం ఇస్తుంది. కంపెనీ నియమ నిబంధనలు పాటిస్తూ తోటి ఉద్యోగులతో సఖ్యతగా ప్రవర్తిస్తూ.. నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతీ అన్నట్లుగా మన విధానం మెరుగుపరుచుకోవాలి. నైపుణ్యాలు పెంచుకోవాలి. పనిలో నాణ్యత ప్రదర్శించాలి. యజమాని మెప్పు పొందే విధంగా మన తీరును మార్చుకోవాలి. అప్పుడే మనకు సరైన గుర్తింపు వస్తుంది. గుంపులో గోవిందయ్య అన్నట్లు కాకుండా మనకంటూ ఓ ప్రత్యేకతను ప్రదర్శించుకోవాలి. మన కోసం పని ఉన్నట్లుగా భావించుకోవాలి. చేసే పనిలో దైవత్వం వెతుక్కోవాలి.

    నిబంధనలు

    పనిచేసే చోట అందరితో కలివిడిగా ఉండాలి.
    అనవసరమైన పట్టింపులకు పోకూడదు.
    పుకార్లు పుట్టించే వారి పట్ల జాగరూకతతో మెలగాలి.
    నిబద్ధతతో ముందుకు సాగాలి.
    క్రమశిక్షణకు ప్రాణం పోయాలి.
    గొడవలకు దూరంగా జరగాలి.
    యజమానితో మంచిగా మాట్లాడాలి.

    పనిచేసే పరిశ్రమలో మనకంటూ ఓ ప్రత్యేక వాతావరణం ఏర్పరుచుకోవాలి. యాజమాన్యంతో సహకరిస్తూ మన పని మనం చేసుకుంటూ పోవాలి. పనినే దైవంగా భావించి కంపెనీ ఉన్నతికి ఉపయోగపడాలి. కంపెనీ ఎదిగే సందర్భంలో మన పాత్ర కూడా ఉండేలా వ్యవహరించాలి. చేసే పనిలో నైపుణ్యత పెంచుకుని కంపెనీ సమస్యలు పరిష్కరించే విధంగా చొరవ చూపించాలి. ఏ సమస్య వచ్చినా మనది కాదనే వాదన చేయకుండా అందరిదిగా భావించి పరిష్కరించే విధంగా మన ఆలోచనలకు పదును పెట్టాలి.

    పారదర్శకతకు పెద్దపీట
    కంపెనీలో పారదర్శకతకు పెద్దపీట వేయాలి. దాపరికాలు లేని విధంగా అందరూ అభిప్రాయాలు పంచుకోవాలి. ఒకరికొకరు సహకరించుకుని సమస్యలు లేని కంపెనీగా పేరు తెచ్చుకునే విధంగా ప్రవర్తించాలి. అప్పుడే కంపెనీ ఇమేజ్ పెరిగి లాభాలు పుంజుకుంటాయి. విశ్వాసంతో మెలిగినప్పుడే మరిన్ని విజయాలు అందుకునే వీలుంటుంది.