Homeఎంటర్టైన్మెంట్Ram Pothineni : రామ్ నాకు అలాంటి వాడితో సమానం అంటూ హీరోయిన్ భాగ్యశ్రీ హాట్...

Ram Pothineni : రామ్ నాకు అలాంటి వాడితో సమానం అంటూ హీరోయిన్ భాగ్యశ్రీ హాట్ కామెంట్స్..

గత కొంతకాలంగా యంగ్ హీరో రామ్ పోతినేని ప్రముఖ హీరోయిన్ భాగ్యశ్రీ భొర్సే తో ప్రేమాయణం నడుపుతున్నారని , ప్రస్తుతం డేటింగ్ లో ఈ క్యూట్ కపుల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇది నిజమని నమ్మే వాళ్ళు ఉన్నారు , అదే విధంగా రూమర్స్ అని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. దీనిపై రామ్ పోతినేని ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు […]

గత కొంతకాలంగా యంగ్ హీరో రామ్ పోతినేని ప్రముఖ హీరోయిన్ భాగ్యశ్రీ భొర్సే తో ప్రేమాయణం నడుపుతున్నారని , ప్రస్తుతం డేటింగ్ లో ఈ క్యూట్ కపుల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇది నిజమని నమ్మే వాళ్ళు ఉన్నారు , అదే విధంగా రూమర్స్ అని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. దీనిపై రామ్ పోతినేని ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు కానీ , భాగ్యశ్రీ భొర్సే మాత్రం రీసెంట్ గా అభిమానులతో జరిగిన ఒక సంభాషణలో రామ్ గురించి చెప్పుకొచ్చింది. రామ్ టాపిక్ వచ్చినప్పుడల్లా , ఆమె సిగ్గు పడే విధానం చూసే చెప్పేయొచ్చు , వీళ్లిద్దరు కచ్చితంగా రిలేషన్ లోనే ఉన్నారనే విషయం. అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు భాగ్యశ్రీ ఇచ్చిన సమాదానాలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ఒక అభిమాని భాగ్యశ్రీ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీ జీవితం లో మంచి థెరఫిస్ట్ ‘ ఎవరు అని అడగ్గా, భాగ్యశ్రీ క్షణం కూడా ఆలోచించకుండా రామ్ పోతినేని అని చెప్పుకొచ్చింది. థెరఫిస్ట్ అంటే డాక్టర్ అనుకునేరు , అన్ని విధాలుగా తోడు ఉంటూ , సరైన సూచనలు ఇచ్చి, మనోధైర్యం నింపే వాళ్లనే థెరఫిస్ట్ అంటారు. మన జీవితం లో మన తల్లిదండ్రులు ఈ స్థానంలో ఉండొచ్చు , అదే విధంగా మన జీవిత భాగస్వాములు కూడా ఉండొచ్చు. భాగ్యశ్రీ రామ్ ని థెరఫిస్ట్ అంటాయి సంబోధించిందంటే కచ్చితంగా పరోక్షంగా తనతో ఉన్న రిలేషన్ ని చెప్పకనే చెప్తుందని సమాచారం. అంతే కాకుండా అభిమానులు మీ కో ఆర్టిస్టులతో ఎవరితో స్నేహం చేస్తారు , ఎవరితో డేటింగ్ చేస్తారు , ఎవరిని పెళ్లి చేసుకుంటారు? అనే ప్రశ్న అడుగుతారు.

అందుకు భాగ్యశ్రీ సమాధానం చెప్తూ ‘నాతో కలిసి నటించిన హీరోలందరికీ దాదాపుగా పెళ్లిళ్లు అయిపోయాయి , ఒకే ఒక్క హీరో కి అవ్వలేదు (సిగ్గుతో నవ్వుతూ)’ అంటూ చెప్పుకొచ్చారు. అలా ఎన్నో క్లూలు ఈ సందర్భంగా ఆమె ఇచ్చింది. రాబోయే రోజుల్లో ఈ జంట కూడా విజయ్ దేవరకొండ, రష్మిక జంట లాగానే ఫ్యాన్స్ , ఆడియన్స్ కి షాకింగ్ సర్ప్రైజ్ ఇస్తారని , అందులో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు విలేషకులు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. ఇకపోతే లేటెస్ట్ గా ఆమె హీరోయిన్ గా నటించిన ‘లెనిన్’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిపిస్తూ ముందుకు దూసుకెళ్తోంది. ఆమె కెరీర్ లో ఇదే మొట్టమొదటి సూపర్ హిట్ అనుకోవచ్చు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper