Amaravati Vs Three Capitals: వైఎస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోలేదు. 2024 ఎన్నికల్లో ఆ పార్టీ దారుణంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ప్రజలకు అన్నీ చేసాం కానీ.. వారు గుర్తించలేదంటూ గద్గధ స్వరంతో తనలో ఉన్న బాధను వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పరాజయం తప్పలేదు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణం రాజధాని. అమరావతి రాజధానిని నిర్వీర్యం చేశారు. మూడు రాజధానులు అని ప్రకటించారు. అంతిమంగా రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మిగిల్చారు. ప్రజల్లో ఈ వ్యతిరేకతకు కారణం కూడా అదే. అయితే ఇప్పుడు కూడా దానిని గుర్తించలేని స్థితిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పటికీ అదే అమరావతిపై విషం చిమ్ముతూనే ఉంది.
Also Read: ఎన్డీఏకు జగన్ మద్దతు.. బిజెపి కీలక నేత ఫోన్!
అందరి అభిప్రాయంతోనే..
2014లో టిడిపి( Telugu Desam) అధికారంలోకి వచ్చింది. అందరి అభిప్రాయంతో అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది. దీనికి వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం జై కొట్టారు. అమరావతికి సేకరించిన భూమి చాలదని.. మరింత సేకరించాలని సూచన చేశారు. అలా ఆమోదం పొందిన అమరావతి నిర్మాణ పనులను ప్రారంభించారు చంద్రబాబు. అయితే అమరావతి కలల రాజధాని సాకారం అయితే తప్పకుండా చరిత్రలో నిలిచిపోతారు చంద్రబాబు. అందుకే అమరావతికి ఆమోదం తెలిపినా.. లోలోపల అడ్డు తగులుతూ వచ్చింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు దక్కకుండా చేయాలని అప్పట్లో గట్టిగానే ప్రయత్నం చేసింది. ఎన్డీఏ లో ఉన్న తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చేలా వ్యూహం రూపొందించి అమలు చేయగలిగింది. అలా తెలుగుదేశం పార్టీ రావడంతో.. అదే ఎన్డీఏతో పరోక్ష స్నేహం కొనసాగించింది. అయితే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే పాకులాడిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ… ఏపీ కలలను మాత్రం చిదిమేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని ఎడారిగా మార్చింది. తాను అనుకున్న మూడు రాజధానులను సాధించలేకపోయింది. అయితే ఏపీ ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవర్తనను, వ్యవహార శైలిని గుర్తించి దారుణంగా మొన్నటి ఎన్నికల్లో దెబ్బతీశారు. అయినా సరే ఆ పార్టీలో మార్పు రావడం లేదు.
గుణపాఠాలు నేర్చుకోని వైసిపి
ఒక్క మాటలో చెప్పాలంటే 2024 ఎన్నికల్లో అమరావతి( Amravati capital) రాజధాని అంశం ప్రధానంగా పనిచేసింది. దానికి తోడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టిని ముంచింది. అయినా సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుణపాటాలు నేర్చుకోలేదు. 2019లో అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి కాదు కమ్మరావతి, ఇది రాష్ట్ర రాజధాని కాదు స్మశానం వంటి వ్యాఖ్యలు చేశారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. అధినేత జగన్మోహన్ రెడ్డి నుండి గ్రామస్థాయి నేత వరకు అందరూ అమరావతిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు కూడా అమరావతి వరద ప్రాంతంలో కట్టేస్తున్నారని.. భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. అదేపనిగా ప్రచారం చేస్తున్నారు. తనను తాను మేధావిగా ప్రకటించుకునే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సైతం.. ఇన్నాళ్లు ఎంతో విలువైన పులస చేప ఒక్క గోదావరి జిల్లాలకు మాత్రమే పరిమితం అయిందని.. ఇకనుంచి రాష్ట్ర రాజధాని అమరావతిలో సైతం పట్టుకునే అవకాశం వచ్చిందంటూ వ్యంగ్యంగా విమర్శ చేయడం జుగుప్సాకరంగా ఉంది. ఇప్పటికీ రాజధాని విషయంలో వైసిపి బుద్ధి మారలేదని స్పష్టమైంది. 2024 ఎన్నికల్లో జగన్ మూడు రాజధానుల నిర్ణయానికి తోడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపేసింది. అయితే ఇప్పుడు కూడా అమరావతిపై విషం కక్కుతూనే ఉన్నారు. తప్పకుండా 2029 ఎన్నికల నాటికి వైసీపీని ఈ విషప్రచారం దహించడం ఖాయం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Also Read: ఏపీలో పాలన.. చంద్రబాబు, జగన్ మధ్య తేడా అదే!
అదే పనిగా ప్రచారం..
గత కొద్దిరోజులుగా ఏపీవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. వాగుల్లో సైతం నీటి ప్రవాహం అధికంగా ఉంది. అయితే అమరావతి మునిగిపోయింది.. అమరావతికి వరదలు.. నదులను మరిపిస్తున్న నవ నగరాలు.. చెరువులను తలపిస్తున్న నిర్మాణాలు అంటూ అవహేళనలు చేస్తున్నారు. నీలి మీడియాలో అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. అయితే వాస్తవాలను మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. గతంలో సైతం ఇదే తరహా ప్రచారం చేసి దారుణంగా దెబ్బతిన్న చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. ఐదేళ్లపాటు తెగ ప్రచారం చేశారు. ఎన్నికల నాటికి ప్రజలు వాస్తవాలను గుర్తించి గట్టిగానే బుద్ధి చెప్పారు. అయినా సరే పాత వాసనలే వినిపిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి గడ్డు పరిస్థితులు తప్పవని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.