Allu Arjun, AA22 : తన ప్రతీ సినిమాతో ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించాలని పరితపించే హీరోలలో ఒకరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun). ఈయనకు ఉన్నంత కసి టాలీవుడ్ లో ఏ స్టార్ హీరోకి కూడా లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘పుష్ప’ సిరీస్ తో అల్లు అర్జున్ కసి , టాలెంట్ ఎలాంటిదో ఇండియా మొత్తం చూసింది. తన అద్భుతమైన నటన , స్వాగ్ , స్టైల్ తో ఈ చిత్రాన్ని ఒక బ్రాండ్ గా మార్చేశాడు అల్లు అర్జున్. నేడు దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తూ ముందుకు దూసుకువెళ్తున్న ‘ధురంధర్ 2’ లాంటి చిత్రానికి కూడా ‘పుష్ప 2’ ని అందుకోవడం కష్టం గా ఉందంటే , ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. అలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ పై అభిమానుల్లో ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఉంటాయో తెలిసిందే.
ఆ అంచనాలను అందుకోవడం సాధారణమైన విషయం కాదు . కత్తి మీద సాము లాంటిది. కానీ ఎన్ని అంచనాలు అయినా పెట్టుకోండి , అంతకు మించే ఇస్తా అన్నట్టుగా అల్లు అర్జున్ నేడు ఉదయం అట్లీ మూవీ కి సంబంధించిన ప్రీ లుక్ ని విడుదల చేసినప్పుడు సోషల్ మీడియా మొత్తం ఊగిపోయింది. బీస్ట్ చెయ్యి ని చూపిస్తూ, చాలా కొత్తగా , ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు క్రియేట్ అయ్యేలా చేసాడు. అంటే అల్లు అర్జున్ ఇందులో ఎలాంటి లుక్ లో కనిపించబోతున్నాడు అనేది ఇప్పుడు అందరిలో తీవ్రమైన ఉత్కంఠని రేపుతోంది. అయితే ఈ చిత్రానికి రెండు సమాంతరంగా ప్రపంచాలు సంబంధించిన స్టోరీ గా చెప్తున్నారు. అందులో అల్లు అర్జున్ ఒక ప్రపంచం లో వింత జీవి లాగా కనిపించబోతున్నాడని , ఆయన లుక్ ‘కింగ్ కాంగ్’ ని తలపించేలా ఉంటుందని అంటున్నారు.
ఈ చిత్రానికి ‘అయాన్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారని కొందరు, ‘వైల్డ్ ఫైర్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. కానీ మేకర్స్ నుండి చిన్న లీక్ కూడా రాలేదు. ఈ సోషల్ మీడియా కాలం లో టైటిల్ లీక్ అవ్వకుండా మ్యానేజ్ చేయడం అనేది సాధారణమైన విషయం కాదు . రేపు ఉదయం 11 గంటల వరకు టైటిల్ కోసం ఎదురు చూడాల్సిందే. అప్పటి వరకు ఎవరి ఊహాగానాలు వారివి. ఇందులో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి విలన్ క్యారెక్టర్. రేపు విడుదల అయ్యేది ఆ క్యారెక్టర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ అని అంటున్నారు విశ్లేషకులు.
Title Poster tomorrow at 11 AM.#AA22xA6 pic.twitter.com/3do0GyDiFj
— Allu Arjun (@alluarjun) April 7, 2026