Homeక్రీడలుక్రికెట్‌RCB vs CSK: గూగుల్ మోతెక్కిపోయింది.. ఇదో ప్రపంచ రికార్డు..

RCB vs CSK: గూగుల్ మోతెక్కిపోయింది.. ఇదో ప్రపంచ రికార్డు..

RCB vs CSK: ఐపీఎల్ జరుగుతున్నప్పుడు.. ఏదైనా జట్టు భారీగా పరుగులు చేస్తే కొత్త రికార్డు సాధ్యమవుతుంది. ఒక ఆటగాడు భారీగా పరుగులు చేస్తే లేదా భారీగా వికెట్లు పడగొడితే.. సరికొత్త ఘనత లిఖితమవుతుంది. కానీ, ఈ రెండు జట్లు వాడితే.. ప్రపంచ వ్యాప్తంగా సేవలందించే గూగుల్ మోతెక్కిపోయింది.. సరికొత్త రికార్డు సాధ్యమైంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చిరకాల ప్రత్యర్ధులుగా బెంగళూరు, చెన్నై జట్లు కొనసాగుతున్నాయి. ఈ రెండు జట్ల మధ్య పోటీని ఆటగాళ్లు మాత్రమే కాకుండా.. అభిమానులు కూడా విపరీతంగా ఆస్వాదిస్తూ ఉంటారు. గతంలో చెన్నై జట్టు బెంగళూరు మీద సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించేది. ఇటీవల కాలంలో బెంగళూరు జట్టు గట్టిగా పోరాడుతోంది. పోరాడితే పోయేదేమీ లేదు అన్నట్టుగా ఆడుతోంది. ఫలితంగా చెన్నై జట్టు మీద విజయాలు సాధిస్తోంది.

గత సీజన్లో చెన్నై జట్టు మీద బెంగళూరు విజయాలు సాధించింది. ఈ ఏడాది కూడా అదే పరంపరను కొనసాగిస్తుంది. ఇటీవలి మ్యాచ్లో బెంగళూరు చెన్నై మీద విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసి 250 పరుగులు చేసింది. ఆ తర్వాత చెన్నై జట్టును లక్ష్యానికి దూరంగానే ఉంచేసింది. బ్యాటింగ్లో అదరగొట్టిన బెంగళూరు.. బౌలింగ్లో కూడా అదే ధోరణి కొనసాగించింది.

బెంగళూరు, చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు మాత్రమే కాదు.. గూగుల్ కు కూడా విపరీతంగా ఆదాయాన్ని తీసుకొచ్చింది.. మన దేశవ్యాప్తంగా అత్యధికంగా సెర్చింగ్ జాబితాలో ఈ మ్యాచ్ నిలిచింది. మొత్తంగా ఐదు మిలియన్ ప్లస్ సెర్చెస్ తో ఈ మ్యాచ్ రికార్డ్ సృష్టించింది.

బెంగళూరు, చెన్నై జట్ల మధ్య జరిగే మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? ఎవరు ఎక్కువ పరుగులు చేస్తారు? ఎవరు ఎక్కువ వికెట్లు తీస్తారు? ఏ స్థాయిలో పరుగులు నమోదు అవుతాయి? ఏ జట్టు ముందుగా బ్యాటింగ్ చేస్తుంది? విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడా? మాత్రే మెరుపు వేగంతో పరుగులు తీస్తాడా? అనే ప్రశ్నలను గూగుల్ లో అభిమానులు సెర్చ్ చేశారు..

అయితే ఈ మ్యాచ్లో బెంగళూరు గెలిచిన తర్వాత.. ఆ జట్టు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ముఖ్యంగా ఓ బెంగళూరు మహిళా అభిమాని చెన్నై అభిమాని ఉద్దేశించి చేసిన రచ్చ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఆ వీడియో ఇప్పటికి విపరీతంగా సర్కులేట్లో ఉంది. తదుపరి మ్యాచ్లో ఒకవేళ చెన్నై గెలిస్తే బెంగళూరుకు ఇంతకంటే ఎక్కువ ట్రీట్మెంట్ ఉంటుందని ఎల్లో ఆర్మీ అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper