తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం మరోసారి పాలిటిక్స్ లో యాక్టివ్ కావాలని ఆలోచిస్తున్నాడు. కరీంనగర్-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి రాబోయే శాసనమండలి ఎన్నికలలో పోటీ చేయాలని కోదండరాం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు గ్రాడ్యుయేట్ల మద్దతు కోసం ప్రచారం చేయాలని నిర్ణయించారట.. అన్నీ సరిగ్గా జరిగితే త్వరలోనే నామినేషన్ దాఖలు చేస్తాడని సమాచారం. కోదండరాంకు బిజెపి, ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి.
టిఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మొదట్లో తన సొంత పార్టీ అభ్యర్థిని నిలబెట్టాలని అనుకున్నప్పటికీ కోదండరాం మీద గెలవడం కష్టం కాబట్టి.. టిఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికలలో ఓడిపోతే అది తనకు అవమానంగా ఉంటుందని డ్రాప్ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ వైదొలిగి అక్కడ పోటీచేస్తున్న ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మద్దతు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కాబట్టి, అధికారిక అభ్యర్థిని నిలబెట్టడానికి బదులుగా, టిఆర్ఎస్ పరోక్షంగా నాగేశ్వర్ కు మద్దతు ఇస్తుందని అంటున్నారు.
Also Read: టీఎస్–బీపాస్.. : సామాన్యులకు ఎంత లాభం?
టీఆర్ఎస్ వైదొలగడంతో అటు కోదండరాం, ఇటు నాగేశ్వర్ గెలవడానికి సమస్యలు లేవని తెలుస్తోంది. కోదండరాంపై అభ్యర్థిని పెట్టకూడదని టీఆర్ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే కోదండకు కేసీఆర్ భయపడుతున్నాడని ప్రచారం జరుగుతోంది.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Kcr afraid to compete with kodandaram
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com