Also Read : కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
కెసిఆర్ నాటిన అడవి మరీ
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో నానా యాగీ చేస్తున్న భారత రాష్ట్ర సమితి నాయకులకు కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో కౌంటర్ ఇస్తున్నారు. హైటెక్ సిటీ ప్రాంతంలో డైనోసార్లు, ఏనుగులు, జింకలు, సింహాలు ఉన్నట్టు.. కెసిఆర్ ప్రభుత్వ హయాంలో నాటిన మొక్కలు అవి అడవిగా మారినట్టు.. అందువల్లే హైటెక్ సిటీ ప్రాంతంలో అరుదైన జంతువులు జీవిస్తున్నట్టు.. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఓ ఫోటోను రూపొందించారు. “కెసిఆర్ హయాంలో హైటెక్ సిటీలో అడవి ఏర్పడింది. ఆ అడవిలోనే జంతువులు మొత్తం జీవిస్తున్నాయి. 10 సంవత్సరాల కాలంలో విపరీతంగా మొక్కలు నాటారు కాబట్టి హైటెక్ సిటీ ప్రాంతం మొత్తం అడవిగా మారిపోయిందని” కాంగ్రెస్ నాయకులు సెటైర్లు వేస్తున్నారు. వాస్తవానికి సోషల్ మీడియాలో భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు చాలా యాక్టివ్ గా ఉంటారు. కానీ ఇటీవల కాలంలో కాంగ్రెస్ నాయకులు కూడా బలం పెంచుకున్నారు. సోషల్ మీడియాలో భారత రాష్ట్ర సమితి నాయకులకు దీటుగా బదులిస్తున్నారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో భారత రాష్ట్ర సమితి నాయకులకు ఈ విధంగా కాంగ్రెస్ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు ఆకస్మాత్తుగా ఇలాంటి ఆర్టిఫిషియల్ యుద్ధానికి దిగడంతో ఒక్కసారిగా భారత రాష్ట్ర సమితి నాయకులు డిఫెన్స్ లో పడ్డారు. అయితే వారు తదుపరి అడుగులు ఎలా వేస్తారో తెలియదు కాని.. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ నాయకులు రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. కాంగ్రెస్ నాయకులు రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇమేజ్ లో కారు ఫోటోను కూడా జత చేయడం విశేషం.