వెండితెరపై హీరో.. విలన్ పాత్రలకు ఎంతగా డిమాండ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా హిట్ అవ్వాలన్నా ఫట్ అవ్వాలన్నా ఆ హీరో మీదనే ఆధారపడి ఉంటుంది. దానికి తగ్గట్టుగా విలన్‌ను చూపిస్తేనే ఆ సినిమా ఓ రేంజ్‌కి వెళ్తుంది. అయితే.. ఇప్పుడు ఇండస్ట్రీలో నాన్న పాత్రలకూ గిరాకీ బాగానే ఉందట.
Also Read: అఖిల్ కి అంత సీన్ లేదు… వర్షన్ మార్చిన మోనాల్!
అవును.. నాన్న పాత్రల చుట్టే ఇప్పుడు స్టోరీలు రెడీ అవుతున్నాయట. మంచి నాన్న, చెడ్డ నాన్న, విలన్ నాన్న, పరువు కోసం తపించే నాన్న, ఫ్యాక్షనిస్ట్ నాన్న.. బొమ్మరిల్లు నాన్న.. ఇలా చాలా నాన్న పాత్రలు రూపుదిద్దుకుంటున్నాయి. వీటన్నింటికీ పేటెంట్ హక్కులు తీసుకొన్న నాన్న జగపతిబాబు.
Also Read: సిద్దార్థ్ ను పెళ్లి చేసుకుంటే నా బ్రతుకు మరో సావిత్రి అయ్యేది!
ఇటీవల కాలంలో ఏ సినిమా చూసినా నాన్న పాత్రలకు ఆయనే కేరాఫ్ అడ్రస్ అయ్యారు. ఇప్పుడు మరోసారి జగ్గూభాయ్‌కి ఓ మంచి నాన్న పాత్ర దొరికింది. ‘ఫాదర్ – చిట్టి – ఉమా – కార్తీక్’ సినిమాతో. టైటిల్ పొడుగ్గా ఉన్నా పొయెటిక్ గా ఉంది. టైటిల్ బట్టి చూస్తే ఈ సినిమాలో నాన్న పాత్రకున్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు. నాన్నగా జగపతిబాబు నటిస్తున్నాడు. జగ్గూ భాయ్ పాత్ర, తన గెటప్ షాకింగ్‌గా ఉంటాయని తెలుస్తోంది. కార్తిక్, అమ్ము భరణి జంటగా నటిస్తున్నారు. విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దామోదర ప్రసాద్ నిర్మాత. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందట.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Jagapathi babu carafe for father characters
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com