Sandeep Reddy vs Nagashwin : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది ఈరోజు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు తీసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే నీకు ఇదిలా ఉంటే దర్శకులు సైతం భారీ గుర్తింపును సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక దానికి తగ్గట్టుగానే ఫ్యాన్ ఇండియాలో వాళ్లను వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది… చూడాలి మరి ఇకమీదట మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎంతమంది స్టార్ డైరెక్టర్లు ఫ్యాన్ ఇండియాలో వాళ్ళ సత్తా చాటుకుంటారు అనేది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) ఆయన చేసే ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల మీద యావత్ ప్రేక్షకులందరిలో మంచి ఆసక్తి అయితే నెలకొంది. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేయబోతున్న సినిమాల పట్ల చాలావరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం సందీప్ వంగ ప్రభాస్ (Prabhas)తో స్పిరిట్ (Spirit) సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ తో కల్కి (Kalki) సినిమా చేసి స్టార్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్(Nag Ashwin)…ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా చాలా మంచి గుర్తింపునైతే సంపాదించుకున్నాడు. అయితే వీళ్ళిద్దరి మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు అయితే స్టార్ట్ అయ్యాయి అంటూ కొంతమంది కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు. నిజానికి నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన మహానటి సినిమాలో సందీప్ రెడ్డి వంగ ఒక చిన్న క్యారెక్టర్ లో నటించాడు. మరి ఇలాంటి సందర్భంలో వీళ్ళ మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికి కల్కి సినిమా రిలీజ్ అయిన సందర్భంలో నాగ్ అశ్విన్ చేసిన ట్వీట్ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసిందనే చెప్పాలి.
అదేంటి అంటే ఏమాత్రం రక్తపాతం లేకుండా నేను వెయ్యి కోట్ల మార్కుని అందుకున్నాను అంటూ ఆయన చేసిన ట్వీట్ సందీప్ రెడ్డి వంగని ఉద్దేశించే అని చాలామంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేశారు. ఎందుకంటే అనిమల్ (Animal) సినిమాతో సందీప్ రెడ్డివంగా 900 కోట్ల కలెక్షన్లు మాత్రమే రాబట్టాడు.
అలాంటిది చాలా రక్తపాతంతో కూడిన సన్నివేశాలైతే ఉంటాయి. మరి ఆ సన్నివేశాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని నాగ్ అశ్విన్ ఇలాంటి ట్వీట్ చేశాడు అంటూ మరి కొంతమంది అయితే కామెంట్లు చేయడం అప్పుడు సంచలనాన్ని రేకెత్తించింది. మరి ఏది ఏమైనా కూడా కూల్ గా ఉండే నాగ్ అశ్విన్ వీళ్ళిద్దరి మధ్య ఎందుకు డిస్టబెన్స్ వచ్చాయి అనేది తెలియడం లేదు.
కానీ మొత్తానికైతే ప్రస్తుతం వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా గొడవలైతే ఉన్నాయనే మాటలైతే చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి…ఇక ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా చేయాలని అనుకుంటుంటే సందీప్ కంటే ముందే నాగ్ అశ్విన్ ప్రభాస్ తో కల్కి 2 సినిమాని తెరకెక్కించాలని చూస్తున్నాడు. మరి ప్రభాస్ ఎవరి సినిమా ముందు చేస్తాడు అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది…