NTR: జూనియర్ ఎన్టీఆర్ మల్టీటాలెంటెడ్ హీరో. టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరు. ఆర్ ఆర్ ఆర్ తో గ్లోబల్ ఫేమ్ రాబట్టాడు. నాన్ రాజమౌళి మూవీ దేవరతో రూ. 500 కోట్లకు పైగా రాబట్టాడు. నార్త్ లో దేవర రూ. 60 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిన నేపథ్యంలో అక్కడ కూడా దేవర హిట్. పాన్ ఇండియా హీరో ట్యాగ్ కి తాను అర్హుడినే అని నిరూపించుకున్నాడు. పలువురు సీనియర్ నటులు ఎన్టీఆర్ గొప్పతనాన్ని కొనియాడారు. ఈ తరం హీరోల్లో ఎన్టీఆర్ గొప్ప నటుడు అన్నారు.
మరి అలాంటి ఎన్టీఆర్ ని ఓ నటుడు డామినేట్ చేశాడట. అందుకు నొచ్చుకున్న ఎన్టీఆర్ నీ ముఖం నాకు చూపించకు అన్నాడట. ఆ నటుడు ఎవరో కాదు జగపతిబాబు. ఎన్టీఆర్-జగపతిబాబు కాంబోలో నాన్నకు ప్రేమతో, అరవింద సమేత వీర రాఘవ వంటి చిత్రాలు తెరకెక్కాయి. ఈ రెండు చిత్రాల్లో జగపతిబాబు ప్రతి నాయకుడు పాత్ర చేశాడు. అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో బసిరెడ్డి అనే కరుడుగట్టిన ఫ్యాక్షనిస్ట్ రోల్ చేశాడు.
ఈ సినిమాను ఉద్దేశించి జగపతిబాబు మాట్లాడుతూ… అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో నా రోల్ ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది. బాగా కుదిరింది. నాది చాలా అగ్రెసివ్ రోల్. తారక్ పాసివ్ రోల్ చేశాడు. అంత స్టార్డం ఉన్న హీరో ఆ తరహా రోల్ ఒప్పుకోవడం కష్టం. తారక్.. నువ్వు అది చేస్తున్నావ్, నన్ను ఇది చేస్తున్నావ్, నీ క్యారెక్టర్ చాలా బాగుంది అంటుండేవాడు. ప్రతి రాత్రి నన్ను తిట్టేవాడు. అది ప్రేమతోనే అనుకోండి.
అరవింద సమేత వీర రాఘవ ప్రీరిలీజ్ వేడుకలో కూడా.. ముందు బసిరెడ్డి గుర్తుకు వస్తాడు తర్వాత నేను గుర్తుకు వస్తాను అన్నారు. అది చాలా పెద్ద స్టేట్మెంట్. తర్వాత ఎన్టీఆర్… బాబు నీతో నాకు కుదరదు. నువ్వు నన్నే ఆడేసుకుంటున్నావ్. అలా జరగకూడదు. ఇక నీతో సరిపోయింది. ఓ నాలుగైదేళ్లు నీ ముఖం నాకు చూపించకు అన్నాడు, అని చెప్పుకొచ్చారు.
కొన్నాళ్ళు నా సినిమాల్లో నువ్వు నటించకు అని పరోక్షంగా చెప్పాడని జగపతిబాబు అన్నారు. అయితే ఇదంతా సరదాగానే జగపతిబాబు-ఎన్టీఆర్ మధ్య జరిగింది. అనంతరం ఆర్ ఆర్ ఆర్, దేవర అనే రెండు పాన్ ఇండియా చిత్రాలు చేసిన ఎన్టీఆర్ ఆరేళ్ళ సమయం తీసుకున్నాడు. ఈ చిత్రాల్లో జగపతిబాబు నటించలేదు.
Web Title: Jagapathi babu made interesting comments about ntr
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com