సుశాంత్ సింగ్ రాజ్ పుట్ మరణంతో బాలీవుడ్ మరొక్కసారి తెరపైకి వచ్చింది. కంగనా రౌత్ రిపబ్లిక్ టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూ బాలీవుడ్ ని ఒక కుదుపు కుదిపింది. చివరకు భారత ప్రభుత్వం కూడా దీనిపై స్పందించాల్సి వచ్చింది. బాలీవుడ్ సెలబ్రిటీలు పాకిస్తాన్ గూడచారి సంస్థ ఐఎస్ ఐ తో , అలాగే కాశ్మీర్ ప్రత్యెక వాదులు, మిలిటెంట్ల తో సంబంధాలు వున్న వాళ్ళతో దూరంగా వుండాలని హెచ్చరించింది. ఇది చాలా తీవ్రమైన విషయం. మొదట్నుంచీ బాలీవుడ్ తో మాఫియా ముఠాల సంబంధాలు తెలిసిన విషయమే. ఇది ఈ రోజుది కాదు. పేరుమోసిన దావూద్ ఇబ్రహీం లాంటి వాళ్ళ దగ్గరనుంచి చిన్న చిన్న చోట మోటా ముఠాల వరకు బాలీవుడ్ పరిశ్రమ తో సంబంధాలు వున్నాయి. అయినా ప్రభుత్వం ఏమీ చేయలేక పోతుంది. ప్రభుత్వం ఏమాత్రం జోక్యం చేసుకున్నా వెంటనే అది పెను దుమారం గా మారుతుందని అందరూ భయపడి దాని జోలికి వెళ్ళటం లేదు. మొట్టమొదటసారి మోడీ ప్రభుత్వం శివ సేన ఎంపి రాసిన లేఖపై స్పందిస్తూ ఈ దేశ వ్యతిరేక శక్తులతో సెలబ్రిటీలు దూరంగా వుండాలని చెప్పింది. ఇదేమీ చిన్న విషయం కాదు.
ఉదాహరణకు షా రుఖ్ ఖాన్ కి టోనీ ఆషే తో వ్యాపార లావాదేవీలు వున్నాయి. దుబాయ్ లో వీళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారం లో పెట్టుబడులు వున్న సంగతి తెలిసిందే. కానీ ఈ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ కాశ్మీర్ లో భారత సైన్యం పై ఎన్నో ఆరోపణలు చేయటమే కాకుండా హింసను కూడా ప్రోత్సహించాడు. ఇతను బ్రిటిష్ పౌర సత్వం వున్న పాకిస్తానీ. ఎప్పుడూ పాకిస్తాన్ అనుకూల వైఖరినే ప్రదర్శిస్తూ ఉంటాడు. అలాగే ఇంకో వ్యక్తి ఐ ఎస్ ఐ తో సంబంధాలు వుండి కూడా బాలీవుడ్ లో ప్రముఖలతో సంబంధాలు నేరపుతున్నాడు. అనిల్ కపూర్ తో వ్యాపార భాగస్వామి గా వున్నాడు. అలాగే కరణ్ జోహార్ తో కూడా ఇంకో వ్యక్తి ఇటువంటి సంబంధాలే వున్నాయి. ఇంతకుముందు సంజయ్ దత్ వ్యవహారం మనందరికీ తెలిసిందే. ఇవన్నీ తెలిసికూడా చూసి చూడనట్లు వుండటం అంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవటమే .
ఇందులో సంబంధాలు నెరుపుతున్న సెలబ్రిటీలు అందరికీ దేశ వ్యతిరేక కార్యక్రమాలతో సంబంధాలు వుండి ఉండక పోవచ్చు. అదే సమయంలో ఎవరికీ లేవని కూడా ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. ఇది ఇలాగే కొనసాగటం దేశ భద్రతకు ప్రమాదం. ఇప్పటికైనా భారత ప్రభుత్వ హెచ్చరికతో నైనా ఈ సంబంధాలు తెగతెంపులు చేసుకుంటే మంచిది. అలాగే ముందుగా పాకిస్తాన్ తో, ఐ ఎస్ ఐ తో సంబంధాలు నేరిపే వారు, మన భారత సైన్యం పై అవాకులు చెవాకులు పేలే వాళ్ళతో సంబంధాలు ముఖ్యంగా వ్యాపార సంబంధాలు ఉండటంపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతయినా వుంది. లేకపోతే ప్రభుత్వమే వీళ్ళను వివరణ కోరాల్సిన అవసరం వుంది. ఇదేదో మీడియా లో పెద్ద వివాదమవుతుందని వెనకాడితే దేశ భద్రతను ఫణంగా పెట్టినవాల్లవుతారని మరిచిపోవద్దు. బాలీవుడ్ ని ప్రక్షాళన చేయాల్సిన తరుణం ఆసన్నమయింది. ఆ సాహసం మోడీ నే చేయగలడు. ఆ పని మొదలు పెడతాడని ఆశిద్దాం.
An Independent Editor, Trend Stetting Analyst.
Read MoreWeb Title: Is it bollywood or under world
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com