Chiranjeevi
Chiranjeevi : 90లలో చిరంజీవి ఇమేజ్ పీక్స్ కి చేరింది. ఇతర భాషల్లో కూడా చిరంజీవికి మార్కెట్ ఏర్పడింది. అప్పట్లో హిందీ అతిపెద్ద పరిశ్రమగా ఉండేది. హిందీ నేషనల్ లాంగ్వేజ్ కావడంతో పాటు ముంబై వేదికగా ఇండియన్ సినిమా అభివృద్ధి చెందింది. ఒక ప్రాంతీయ భాషా హీరో అయినప్పటికీ చిరంజీవి చిత్రాలు భారీ వసూళ్లు రాబట్టేవి. అమితాబ్ కంటే చిరంజీవి ఎక్కువ పారితోషికం తీసుకున్నాడని, గ్యాంగ్ లీడర్ సక్సెస్ తర్వాత చిరంజీవి రూ. 1.2 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నారట ఓ నేషనల్ మ్యాగజైన్ ప్రచురించింది.
Also Read : చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ హీరోయిన్ ఉండదా..? మెగాస్టార్ కెరీర్ లోనే సరికొత్త ప్రయోగం!
చిరంజీవి హిందీలో కూడా సక్సెస్ అవ్వాలని 1990లో ప్రతిబంధ్ టైటిల్ తో మూవీ చేశాడు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించాడు. జుహీ చావ్లా హీరోయిన్ గా నటించింది. ప్రతిబంధ్ రాజశేఖర్ తెలుగులో చేసిన అంకుశం రీమేక్. ఈ మూవీ హిందీలో కూడా ఆడింది. అక్కడ కూడా చిరంజీవి పేరు మారుమ్రోగింది. హిందీ పరిశ్రమ తెలుగు కంటే పెద్దది కావడంతో చిరంజీవి ముంబైలో సెటిల్ అవుతాడు. హిందీ చిత్రాలు చేస్తాడు అనే ఊహాగానాలు వెలువడ్డాయి. ప్రతిబంధ్ విడుదల అనంతరం హిందీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరంజీవికి ముంబైలో సెటిల్ అవుతారా? అనే ప్రశ్న ఎదురైంది.
అది సాధ్యం కాదు. నా ఇల్లు చెన్నైలో ఉంది. నా కుటుంబ సభ్యులు కూడా ముంబైలో ఇమడలేరు. నేను హిందీ చిత్రాలు చేస్తాను. కానీ ముంబైలో నివాసం ఉండటం జరగదు అన్నాడు. ఇక ప్రతిబంధ్ విజయం సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ దక్కుతుంది. అందరికీ మించి ఆదరించిన ప్రేక్షకులకు చెందుతుంది అన్నారు. ప్రతిబంధ్ సక్సెస్ నేపథ్యంలో చిరంజీవి హిందీ చిత్రాలు చేయడం స్టార్ట్ చేశాడు. ఇండస్ట్రీ హిట్ గ్యాంగ్ లీడర్ ని ఆజ్ కా గూండా టైటిల్ తో రీమేక్ చేశాడు. అలాగే మహేష్ భట్ దర్శకత్వంలో ది జెంటిల్ మెన్ మూవీలో నటించాడు. ఇవి రెండూ ఆడలేదు.
హిందీ పరిశ్రమ మీద ఫోకస్ చేస్తే.. తెలుగు ప్రేక్షకులకు దూరమయ్యే ప్రమాదం ఉందని చిరంజీవి భావించారు. బాలీవుడ్ లో స్టార్ కావాలన్న కోరికను పక్కన పెట్టాడు. అప్పటికే కొంత డ్యామేజ్ జరిగింది. ఆ టైంలో చిరంజీవి నటించిన చిత్రాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. హిట్లర్ మూవీతో మరలా హిట్ ట్రాక్ ఎక్కాడు. తిరిగి తన స్థానం నిలబెట్టుకున్నాడు.
Also Read : పవన్ కళ్యాణ్ సినిమా కోసం చిరంజీవి మరో త్యాగం..అభిమానులకు ఆనందపడాలో, బాధపడాలో తెలియని పరిస్థితి!
Web Title: Chiranjeevi bollywood movie blockbuster
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com