Salman Khan : బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కి ఆటగాడు అనే పేరు ఉంది. ఇండస్ట్రీ లోకి వచ్చిన ఏ హీరోయిన్ అయినా ట్రెండింగ్ లోకి వస్తే ఆ హీరోయిన్ ని తన సినిమాలోకి తీసుకొని, ఆ తర్వాత ఆమెతో పరిచయం పెంచుకొని నచ్చితే డేటింగ్ చేయడం, లేకపోతే మామూలుగా ఉండడం వంటివి చేస్తాడు. ఇది వరకు ఎంతో మంది హీరోయిన్స్ తో సల్మాన్ ఖాన్ ఇలాంటి వ్యవహారాలు నడిపించాడు. అందుకే ఆయన ఆరు పదుల వయస్సుకి దగ్గర పడుతున్నా కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇది ఇలా ఉండగా కన్నడ సూపర్ స్టార్ కిచ్చ సుదీప్(Kicha Sudeep) కూతురు శాన్వీ(Kicha Shanvi) లేటెస్ట్ గా సల్మాన్ ఖాన్ పై చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో సుదీప్ సల్మాన్(Salman Khan) హీరో గా నటించిన ‘దబాంగ్ 3’ లో విలన్ క్యారక్టర్ చేసాడు. అప్పటి నుండి వీళ్లిద్దరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది.
Also Read : నేను రోజుకు రెండు మూడు గంటలు మాత్రమే నిద్రపోతా..అప్పుడు మాత్రం బాగా పడుకున్న : సల్మాన్ ఖాన్
అయితే రీసెంట్ గా సుదీప్ కూతురు శాన్వీ సల్మాన్ ఖాన్ హీరో గా నటించిన ‘సికిందర్'(Sikindar Movie) చిత్రంలో ఒక కీలక పాత్ర పోషించింది. ఆయనతో పంచి చేసిన అనుభవాన్ని శాన్వీ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్తూ ‘సల్మాన్ ఖాన్ నన్ను తన ఫార్మ్ హౌస్ లో బాగా చెడగొట్టేసాడు. ఆయన ఆతిధ్యం, అతి మర్యాదలను తట్టుకోలేక పోయాను. అంత పెద్ద సూపర్ స్టార్ ఇంత సాధారణ మనిషి లాగా ఉంటాడని అనుకోలేదు. సల్మాన్ ఖాన్ తో ఫార్మ్ హౌస్ లో ఆ మూడు రోజులను నేను నా జీవితాంతం మర్చిపోలేను’ అంటూ చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడిన ఈ మాటలను సోషల్ మీడియా లో కొంత మంది పెడార్ధాలను తీసి సల్మాన్ ఖాన్ ని ట్రోల్స్ చేస్తున్నారు. కూతురు లాంటి అమ్మాయితో అలాంటి రూమర్స్ ని క్రియేట్ చేసిన వాళ్లకు సిగ్గు లేదంటూ సల్మాన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
RVCJ మీడియా సోషల్ మీడియా లో ఈ పోస్ట్ షేర్ చేయగా, నెటిజెన్స్ ఆ పేజీ అడ్మిన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మీరు కూడా ఆ పోస్టుని ఈ చివరి ఆర్టికల్ లో చూడండి. ఇకపోతే కరోనా తర్వాత సల్మాన్ ఖాన్ కి ఇండస్ట్రీ లో సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు. కరోనా పీరియడ్ కి ముందు సల్మాన్ ఖాన్ రూలింగ్ బాలీవుడ్ లో ఏకపక్షంగా ఉండేది. ఆయన సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా రికార్డు స్థాయి వసూళ్లను, ఓపెనింగ్స్ ని రాబడుతూ సంచలనాలు సృష్టించేవి. కానీ ఈమధ్య సరైన బ్లాక్ బస్టర్ తగలలేదు. అందుకే ఆయన అభిమానులు సికిందర్ చిత్రం పై ఆశలు భారీగానే ఉన్నాయి. టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిన ఈ సినిమాకు తమిళ డైరెక్టర్ AR మురుగుదాస్ దర్శకత్వం వహించాడు.
Also Read : 59 ఏళ్ల సల్మాన్ ఖాన్ వివాహం ఎందుకు చేసుకోలేదో తెలుసా?
— RVCJ Media (@RVCJ_FB) March 17, 2025