Pawan Kalyan- YCP: పవన్ కళ్యాణ్ మాటల దాడితో వైసీపీ ఉక్కిరిబిక్కిరి 

Pawan Kalyan- YCP: జ‌న‌సేనాని మాట‌ల తూటాల‌కు వైసీపీ ఉక్కిరిబిక్కిరి అయిందా ? ర‌ణ‌స్థ‌లం వేదిక‌గా ఎన్నిక‌ల ర‌ణ‌రంగానికి న‌గారా మోగించారా ? ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యూహంతో వైసీపీలో భ‌యం మొద‌లైందా ? అంటే.. జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తే అవున‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. శ్రీకాకుళం జిల్లా ర‌ణ‌స్థ‌లంలో జ‌న‌సేన యువ‌శ‌క్తి కార్య‌క్ర‌మం నిర్వ‌హించింది. యువ‌శ‌క్తి వేదిక‌గా అధికార పార్టీ పై స‌మ‌ర శంఖం పూరించింది. అధికార పార్టీ నేత‌ల్లో వ‌ణుకు పుట్టేలా జ‌న‌సైన్యం గ‌ర్జించింది.

Pawan Kalyan- YCP
Pawan Kalyan

“మూడు ముక్క‌ల ముఖ్య‌మంత్రి.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌, ప్రాంతాల మ‌ధ్య చిచ్చు పెడుతున్నారు. భ‌య‌పెడితే భ‌య‌ప‌డం.. ఎదురొస్తాం.. ఎదుర్కొంటాం. 2024లో మీ ఆట‌లు సాగనివ్వం. నీచ్ క‌మీన్ కుత్తే మంత్రులు, సంబ‌రాల రాంబాబూ, గుడివాడ అమ‌ర్నాథ్. నోటికొచ్చిన‌ట్టు వాగుతున్నారు. మ‌రోసారి ప్యాకేజీ కోసం వెళ్లాన‌ని అంటే జ‌న‌సైనికుల చెప్పుతో కొడ‌తాం. వీర మ‌హిళ చెప్పుతో కొడ‌తాం. జ‌న‌సైనికులు కొద‌మ సింహాలు. గ్రామ సింహాలు మ‌న‌ల్ని పాలిస్తున్నాయి. గ్రామ‌సింహాలు నోటికొచ్చిన‌ట్టు మొరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారా ?. కొద‌మ‌సింహాల్లా గ‌ర్జిస్తారా ?“ అంటూ ప‌వ‌న్ ఉద్వేగ‌పూరిత‌మైన ప్ర‌సంగాన్ని ర‌ణ‌స్థ‌లం యువ‌శ‌క్తి కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగించారు.

జ‌న‌సేనాని మాట‌లు తూటాల్లా వైసీపీ నేత‌ల గుండెల్లో గుచ్చుకున్నాయి. అవినీతిప‌రులు, జైల్లో ఉండి వ‌చ్చిన వారు త‌నను విమ‌ర్శిస్తూ ఉంటే న‌వ్వొస్తోంద‌ని ఎద్దేవా చేశారు. మంత్రుల‌ను టార్గెట్ చేసి మాట‌ల దాడి చేశారు. ప్ర‌భుత్వ విధానాల‌ను బ‌ట్ట‌లిప్పి ఎండ‌గ‌ట్టారు. ఉద్దానాన్ని ఎందుకు ఉద్ద‌రించలేద‌ని, ఉత్త‌రాంధ్ర వెనుకబాటుకు కార‌ణ‌మెవ్వ‌ర‌ని ప్ర‌శ్నించారు. ఆద్యంతం ప‌వ‌న్ ప్ర‌సంగం ఉద్వేగంతో, ఆలోచ‌న రేకెత్తించే విధంగా సాగింది. ప‌వ‌న్ ప్ర‌సంగానికి జ‌న‌సైనికులు ఈల‌లు, కేరింత‌లు కొట్టారు.

Pawan Kalyan- YCP
Pawan Kalyan

2024లో మార్పు కోసం త‌న వెంట న‌డ‌వాల‌ని, కేసుల‌కు.. జైళ్ల‌కు భ‌య‌ప‌డొద్ద‌ని అభ‌య‌మిచ్చారు. జ‌న‌సేనాని మాట‌లు అధికార పార్టీలో గుబులు పుట్టించింది. 2024 ఎన్నిక‌ల చిత్రం క‌ళ్ల‌కు క‌న‌ప‌డేలా ప‌వ‌న్ ప్ర‌సంగం సాగింది. వైసీపీలో అంత‌ర్మ‌థ‌నం మొదైలంది. ర‌ణ‌స్థ‌లం వేదిక‌గా జ‌న‌సేనాని క్లియ‌ర్ క‌ట్ మెసేజ్ ఇచ్చారు. దీంతో వైసీపీలో భ‌యం పుట్టుకుంది.

Get notified whenever we post something new!

spot_img

Create a website from scratch

Just drag and drop elements in a page to get started with Newspaper Theme.

Continue reading

Chandrababu : బీజేపీతో టీడీపీ కటీఫ్?.. అందుకే చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకున్నారా?

రెండు రోజుల పాటు ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశానికి కూడా చంద్రబాబుకు ఆహ్వానం అందలేదు. ఈ పరిణామాలన్నింటిని పరిశీలిస్తే చంద్రబాబు కేంద్రంలోని బీజేపీపై పోరు సాగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇరు పార్టీల మధ్య కటీఫ్ జరిగే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

NDA Meeting: ఎన్డీఏ సమావేశానికి టీడీపీని పిలవకపోవడం వెనుక…

రాబోవు ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి శాయశక్తులా కృషి చేస్తున్న పవన్ కల్యాణ్ బీజేపీ నేతల వద్ద తెలుగు దేశం పార్టీ ప్రస్తావనను పదే పదే చేస్తున్నారు. వైసీపీ లేని కూటమి కోసం ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు. టీడీపీని కలుపుకొని వెళితే లాభదాయకంగా ఉంటుందని సూచిస్తున్నారట. రాష్ట్రంలో గురుతర బాధ్యతను పవన్ తీసుకున్నా, బీజేపీ పెద్దలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మరోవైపు టీడీపీ కూడా బీజేపీతో కలిసి వెళ్తానని బహిరంగంగా చెప్పడం లేదు. ఆహ్వానిస్తే ఆలోచన చేస్తామని అంటోంది.

Volunteer System In AP: వలంటీర్ల వ్యవస్థ రద్దు అవుతుందా?

వలంటీర్లపై పక్కా ఆధారాలతో పవన్ కల్యాణ్ ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. కొంతమంది వలంటీర్లు చేస్తున్న ఆకృత్యాల వల్ల మొత్తం ఆ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుందని అంటున్నారు. దీనిపై వలంటీర్లను వైసీపీ నాయకులు రెచ్చగొట్టి ఆందోళన కార్యక్రమాలను చేయించినా, పవన్ కల్యాణ్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆయన చేపట్టిన వారాహి యాత్రలో మరోసారి వలంటీర్ల అంశంపై మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల డేటా మొత్తం హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఏజెన్సీ వద్ద ఎందుకుంది? ఎలా వెళ్లిందో జగన్ సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.