https://oktelugu.com/

జూనియర్లకు మంత్రి పదవులు.. సీనియర్లకు మొండిచేయి?

2019 ఎన్నికల్లో ఏపీలో ఫ్యాన్ గాలి బలంగా వీయడంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి పదవీ చేపట్టి ఇటీవలే ఏడాది పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతూ ప్రజాక్షేత్రంలోకి దూసుకెళుతున్నారు. ఓవైపు కరోనాను కట్టడి చేస్తూనే మరోవైపు ప్రత్యర్థులకు చెక్ పెడుతున్నారు. టీడీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను బయటికి తీస్తూ చంద్రబాబు హయాంలో మంత్రులుగా పనిచేసిన నేతలను కటకటల వెనక్కి పంపుతున్నారు. రాజధాని మార్పు, […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 29, 2020 2:36 pm
    Follow us on


    2019 ఎన్నికల్లో ఏపీలో ఫ్యాన్ గాలి బలంగా వీయడంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి పదవీ చేపట్టి ఇటీవలే ఏడాది పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతూ ప్రజాక్షేత్రంలోకి దూసుకెళుతున్నారు. ఓవైపు కరోనాను కట్టడి చేస్తూనే మరోవైపు ప్రత్యర్థులకు చెక్ పెడుతున్నారు. టీడీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను బయటికి తీస్తూ చంద్రబాబు హయాంలో మంత్రులుగా పనిచేసిన నేతలను కటకటల వెనక్కి పంపుతున్నారు. రాజధాని మార్పు, జిల్లాల విభజన అంశాల్లోకి ప్రత్యర్థి పార్టీలను ముగ్గులోకి లాగి అభివృద్ధికి ఈ పార్టీలు ఆటంకాలు సృష్టిస్తున్నాయని ప్రజల్లోకి బలంగా తీసుకెళుతున్నారు.

    Also Read: కన్నా తొలగింపును జీర్ణించుకోని టీడీపీ మీడియా

    ఇదంతా రాజకీయ వ్యూహాంలో భాగమే అయినప్పటికీ వైసీపీలో మాత్రం అంతకంతకు అసంతృప్తి పెరిగిపోతుందనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధికారంలోకి రావడంతో పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన వారు పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక పార్టీలో ఎన్నో ఏళ్లుగా కష్టపడిన వారిని పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు, పార్టీ కోసం ఏమాత్రం కష్టపడని వారికి కీలక పదవులు అప్పగిస్తుండటంపై సీనియర్లంతా లోలోపల మథన పడుతున్నారు. ఇటీవల వైసీపీ నుంచి తొలిసారి ఎమ్మెల్సేగా గెలిచిన ఇద్దరికి జగన్ మంత్రి పదవీ ఇవ్వడంతో పార్టీలో విస్కృతంగా చర్చ జరుగుతోంది.

    వైసీపీ అధికారంలోకి రావడానికి ఎంతో కష్టపడిన నేతలను పక్కకు పెట్టి జూనియర్లకు మంత్రి పదవులు కట్టబెట్టడంపై సీనియర్ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని టాక్ విన్పిస్తోంది. కొత్తగా అసెంబ్లీకి ఎన్నికైన అప్పలరాజు, వేణులు పార్టీ కోసం కష్టపడింది ఏమిలేదని అంటున్నారు. ఈ ఇద్దరి వల్ల పార్టీకీ పెద్దగా ఒరిగేందేమీ లేదంటున్నారు. పార్టీ కోసం కష్టపడిన నేతల్లో బీసీలు ఎంతమంది ఉన్నప్పటికీ తొలిసారి ఎమ్మెల్సేలుగా ఎన్నికైన వారికి మంత్రి పదవులు ఇవ్వడంపై సీనియర్లంతా జగన్మోహన్ రెడ్డిపై గుస్సా అవుతున్నారట. ఇప్పుడన్న క్యాబినెట్లోనూ బోత్స, పెద్దిరెడ్డి మినహా ఎవరూ సీనియర్లు లేరంటున్నారు.

    Also Read: కొత్త తెలంగాణ పీసీసీ చీఫ్ కు అదే అడ్డు?

    గతంలో మంత్రలుగా పని చేసినవారు, జిల్లాలను శాసించిన నేతలు ఎంతోమంది వైసీపీలో ఉన్నారు. వీరంతా కూడా వైసీపీ అధికారంలోకి వస్తే మళ్లీ చక్రం తిప్పవచ్చని పార్టీ గెలుపు కోసం కష్టపడి పని చేశారు. అయితే వీరి ఆశలపై జగన్ ప్రతీసారి నీళ్లు చల్లుతున్నారు. తొలి క్యాబినెట్లో జూనియర్లకే జగన్ పెద్దపీఠ వేశారని అంటున్నారు. జగన్ తన సొంత ఏజెండాలో భాగంగానే ఇలా చేస్తున్నారని సీనియర్లు ఆరోపిస్తున్నారు. తాజాగా ఖాళీ అయిన రెండు మంత్రి పదవులను కూడా జగన్ జూనియర్లకు కేటాయించడంపై సీనియర్లు అసంతృప్తిలో రగిలిపోతున్నారట.

    అయితే సీఎం జగన్ ను పార్టీలో గట్టిగా అడిగే పరిస్థితి లేకపోవడంతో సీనియర్లంతా మిన్నకుండిపోతున్నారని టాక్ విన్పిస్తుంది. ప్రస్తుతం వైసీపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సీనియర్ల ఆవేదనలో న్యాయం ఉందనే అనిపిస్తుంది. వైసీపీ నేతల్లో రోజురోజుకు అసంతృప్తి పెరిగిపోతుండటంతో ఇది ఎలాంటి మలుపు తీసుకుంటుందోననే చర్చ పార్టీ శ్రేణుల్లో జోరుగా నడుస్తోంది.