ఏది కరోనా.. ఏది సీజనల్.. తెలుసుకోండి?

కరోనా.. కరోనా.. కరోనా.. ఈ పేరుచెబితే ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. చైనాలోని వూహాన్లో మొదలైన కరోనా ప్రస్థానం అన్నిదేశాలకు పాకింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోటికిపైగా పాజిటివ్ కేసులు నమోదుకాగా రోజుకు లక్షల్లో కొత్త కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కేసుల్లో అమెరికా, బ్రెజిల్, భారత్ తొలి మూడుస్థానాల్లో ఉన్నాయి. భారత్ లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న రికవరీ రేటు గణనీయంగా పెరుగుతుండటం భారతీయులకు కొంత ఉపశమనాన్ని ఇస్తుంది. Also Read: కరోనా అంతానికి […]

Written By: Neelambaram, Updated On : July 29, 2020 1:55 pm
Follow us on


కరోనా.. కరోనా.. కరోనా.. ఈ పేరుచెబితే ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. చైనాలోని వూహాన్లో మొదలైన కరోనా ప్రస్థానం అన్నిదేశాలకు పాకింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోటికిపైగా పాజిటివ్ కేసులు నమోదుకాగా రోజుకు లక్షల్లో కొత్త కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కేసుల్లో అమెరికా, బ్రెజిల్, భారత్ తొలి మూడుస్థానాల్లో ఉన్నాయి. భారత్ లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న రికవరీ రేటు గణనీయంగా పెరుగుతుండటం భారతీయులకు కొంత ఉపశమనాన్ని ఇస్తుంది.

Also Read: కరోనా అంతానికి సరికొత్త డివైస్.. త్వరలో మార్కెట్లోకి

కరోనా మహమ్మరి 2020సంవత్సరం ప్రారంభంలోనే వెలుగులోకి వచ్చింది. ప్రపంచ దేశాలకు మార్చిలో కరోనా గురించి తెల్సియడంతో ఆయా దేశాలకు కరోనాను ఎదుర్కొనేందుకు శతవిధలా ప్రయత్నాలు చేపట్టాయి. చాలాదేశాలు లాక్డౌన్ విధించుకున్నాయి. దీనివల్ల కరోనా వైరస్ కొంతమేర కట్టడి అయినా ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. దీంతో లాక్డౌన్ విధించిన దేశాలు క్రమంగా ఆన్ లాక్ చేస్తుండటంతో కేసుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూపోతుంది. కొన్నిదేశాలు కరోనాను పూర్తిస్థాయిలో కట్టడిచేయగా మరికొన్ని దేశాలు కట్టడి చేయలేక చేత్తులేత్తేస్తుండటం చూస్తూనే ఉన్నాం.

ప్రస్తుతం వర్షకాల సీజన్ మొదలైంది. ఈకాలంలో ప్రజలు సీజనల్ వ్యాధులు బారినపడే అవకాశం ఉంది. కరోనా లక్షణాలు, సీజనల్ వ్యాధి లక్షణాలు ఒకేరకంగా ఉండటంతో ఏది కరోనా? ఏది సీజనల్ వ్యాదో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో పెద్దసంఖ్యలో ప్రజలు కరోనా పరీక్షలు చేయించుకునేందుకు ఆస్పత్రులకు వెళుతుండటంతో వైద్య సిబ్బందికి ఇబ్బందిగా మారుతోంది. దీంతో వారిపై మరింత ఒత్తిడి పెరిగి సమస్య మొదటికీ వచ్చే ప్రమాదం ఉందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. దీంతో ప్రజలు తమకు తాముగా ఏది కరోనా లక్షణాలు, ఏది సీజనల్ లక్షణాలు అని తెలుసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

కరోనాకు సీజనల్ వ్యాధికి తేడా గుర్తించండి..

కరోనా వైరస్ లక్షణాల్లో అంటే జ్వరం, దగ్గు, జలుబు లాంటివి ప్రధానంగా కన్పిస్తాయి. ఈ లక్షణాలే సీజనల్ వ్యాధుల్లోనూ కన్పిస్తుంటాయి. అయితే ఈ లక్షణాలను గుర్తిస్తే ఏది కరోనా? ఏది సీజనల్ వ్యాదో గుర్తించడం సులభమని నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా కరోనా విషయానికొస్తే.. తీవ్ర జ్వరం ఉంటుంది. మూడురోజులైన తగ్గదు. జలుబు ఉన్నా ముక్కు కారదు. పొడి దగ్గు వస్తుంది. రుచి, వాసన తెలియదు. ఒంటి నొప్పులు, తలనొప్పి తీవ్రంగా ఉంటాయి. గొంతు నొప్పి, ఛాతిలో నొప్పి వస్తుంది. కళ్లు ఎర్రబడుతాయి. వాంతులు వీరేచనాలు అవుతాయి.

Also Read: కొత్త తెలంగాణ పీసీసీ చీఫ్ కు అదే అడ్డు?

ఇక సీజనల్ వ్యాధి లక్షణాలకు వస్తే.. సాధారణ జ్వరం ఉంటుంది. మూడురోజుల్లో తగ్గిపోతుంది. జలుబు ఉంటే ముక్కు కారుతుంది. కఫంతో కూడిన దగ్గు వస్తుంది. రుచి, వాసన తెలుస్తుంది. ఒంటినొప్పులు, తలనొప్పి సాధారణంగా ఉంటాయి. గొంతునొప్పి ఉంటుంది. ఛాతిలో నొప్పి ఉండదు. కళ్లు ఎర్రబడవు. వాంతులు, వీరేచనాలు ఉంటాయి. ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించి కరోనా అపోహలను, ఆందోళనను దూరం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.