https://oktelugu.com/

కన్నా లక్ష్మీనారాయణ అడుగులు ఎటువైపు?

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ దిగిపోయారు. ఇన్నాళ్లు చేసిన రాజకీయం చాలని ఆయనను బీజేపీ దించేసి ఫైర్ బ్రాండ్ సోము వీర్రాజుకు పగ్గాలు అప్పగించింది. మరి ఈ హఠాత్ పరిణామానికి మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏం చేస్తారు? పార్టీ మారుతారా? లేక ఇదే పార్టీలో ఉంటారా? బీజేపీలో కన్నా లక్ష్మీనారాయణ భవిష్యత్ ఏంటి? ప్రస్తుతం ఏపీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. Also Read: ముక్కోణ పోరులో బాబు అవుట్..! ఎవ్వరూ ఊహించని […]

Written By:
  • NARESH
  • , Updated On : July 29, 2020 / 03:50 PM IST
    Follow us on


    ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ దిగిపోయారు. ఇన్నాళ్లు చేసిన రాజకీయం చాలని ఆయనను బీజేపీ దించేసి ఫైర్ బ్రాండ్ సోము వీర్రాజుకు పగ్గాలు అప్పగించింది. మరి ఈ హఠాత్ పరిణామానికి మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏం చేస్తారు? పార్టీ మారుతారా? లేక ఇదే పార్టీలో ఉంటారా? బీజేపీలో కన్నా లక్ష్మీనారాయణ భవిష్యత్ ఏంటి? ప్రస్తుతం ఏపీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.

    Also Read: ముక్కోణ పోరులో బాబు అవుట్..!

    ఎవ్వరూ ఊహించని విధంగా బీజేపీ అధిష్టానం కన్నా లక్ష్మీనారాయణను దించేసి సోము వీర్రాజుకు పగ్గాలు అప్పజెప్పడాన్ని అటు కన్నా లక్ష్మీనారాయణతోపాటు ఆయన అనుచరులు.. ఇటు టీడీపీ కూడా జీర్ణించుకోలేకపోతోంది. కన్నాకు అన్ని దారులు మూసుకుపోయాకే బీజేపీ జాతీయ నాయకత్వం తెలివిగా కన్నాను ఈ ఉన్నత పదవి నుంచి తొలగించడం సంచలనమైంది.

    2019 ఎన్నికలకు ముందు కన్నా లక్ష్మీనారాయణ నిజానికి వైసీపీలో చేరాలని అనుకున్నారు.కానీ కన్నాకు పిలిచి మరీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చి బీజేపీ లాగేసుకుంది. ఇక ఎన్నికల తరువాత అన్ని రాజకీయ పార్టీలు తలుపులు మూసేశాయి. వైసీపీపై విమర్శలతో కన్నా టార్గెట్ అయ్యారు. ఇటు నెత్తిన పెట్టుకున్న టీడీపీ చిత్తుగా ఓడి ఆ పార్టీ లేచే పరిస్థితిల్లో లేదు.

    Also Read: జూనియర్లకు మంత్రి పదవులు.. సీనియర్లకు మొండిచేయి?

    ఇలాంటి క్లిష్ట సమయంలో బీజేపీ అధ్యక్షుడిగా సేఫ్ సైడ్ లో ఉన్న కన్నాను అధిష్టానం నిర్ధాక్షిణ్యంగా తొలగించి షాక్ ఇచ్చింది. ఇప్పుడు వైసీపీ, టీడీపీతోపాటు కాంగ్రెస్ సహా ఏ ఇతర రాజకీయ పార్టీలో కూడా కన్నాకు ప్రవేశం లేకుండా పోయింది.

    ప్రస్తుతం కన్నా పదవి పోయింది. పార్టీ అధ్యక్షుడు కాదు.. దీంతో ఆయనను ఎవరూ తీసుకునే పరిస్థితి లేదు. ఎక్కడికి వెళ్లే పరిస్థితి కూడా లేదు. బీజేపీ నాయకత్వం కన్నాను జాతీయ రాజకీయాలకు తీసుకెళ్లి అక్కడ పార్టీలో కీలక పదవిని ఇవ్వవచ్చని పార్టీలోని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. దేశంలోని కీలక రాష్ట్రానికి కన్నాను ఇన్ చార్జిగా నియమించే అవకాశాలున్నాయంటున్నారు. అయితే అప్పటివరకు బీజేపీ దయాదాక్షిణ్యాల కోసం ఎదురుచూడడం తప్పితే కన్నా లక్ష్మీనారాయణ కు వేరే ఆప్షన్ లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.