ఏపీగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవలే ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. జగన్ సీఎం అయినప్పటి నుంచి ఓవైపు సంక్షేమం మరోవైపు ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ ముందుకెళుతున్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి ముందుకెళుతున్నారు. ఈక్రమంలోనే గత టీడీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను బయటికి తీస్తూ ఆ పార్టీ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. చంద్రబాబు హయాంలో మంత్రులుగా పనిచేసిన వారంతా ఒక్కొక్కొరుగా జైళ్లకు వెళుతుండటంతో టీడీపీ నేతల్లో భయాందోళన మొదలైంది.
Also Read: జగన్ దెబ్బకు దెబ్బ సిద్ధాంతంలో భాగమేనా ఇది?
చంద్రబాబు నాయుడికి నమ్మకస్థుడిగా ఉన్న మాజీమంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీలో బలమైన నాయకత్వం కలిగిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, జేసీ ప్రభాకర రెడ్డి, చింతమనేని ప్రభాకర్ లాంటి నేతలు ఇప్పటికే అరెస్టయ్యారు. ఇంకా పలువురు టీడీపీ నేతలను జైళ్లకు పంపేందుకు జగన్ సర్కార్ సిద్ధమవుతోంది. ప్రధానంగా ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేతలు ఈ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, పితానితోపాటు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. వీరితోపాటు చంద్రబాబు తనయుడు లోకేష్ బాబు కూడా త్వరలోనే అరెస్టవుతారని ప్రచారం జోరుగా సాగింది.
అయితే రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, ఇతర కారణాలతో ప్రస్తుతానికి టీడీపీ నేతల అరెస్టుకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఏపీలో కరోనా కేసులను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దేశంలోనే అత్యధిక కరోనా టెస్టులు చేస్తూ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇలాంటి సమయంలో టీడీపీ నేతలను అరెస్టు చేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే ఆలోచనతో సీఎం జగన్ వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. తాత్కాలికంగా నేతల అరెస్టులకు బ్రేక్ పడిని అధికారులు రహస్యంగా నేతల అవినీతిపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
Also Read: ఆనం సడెన్ సైలెంట్ వెనుక కారణాలేంటీ?
ప్రస్తుతానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఇతర నేతలెవరూ కూడా ప్రభుత్వానికి పెద్దగా వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. కరోనా నేపథ్యంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోని తన నివాసానికే పరిమితయ్యారు. ఇంకా మిగతా టీడీపీ నేతల హడావుడి కూడా రాష్ట్రంలో ఎక్కడ కన్పించడం లేదు. దీంతో జగన్ సర్కార్ కు ఎదురులేకుండా పోతుండటంతో ప్రస్తుతానికి అరెస్టుల వ్యవహారాన్ని పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది.
జగన్ సర్కార్ ఇప్పటికే టీడీపీ నేతల అవినీతికి సంబంధించిన ఆధారాలన్నీ సేకరించి పెట్టుకుంది. సరైన సమయంలో వాటిని అస్త్రంగా ప్రయోగించనుందని టాక్ విన్పిస్తుంది. ప్రస్తుతానికి కరోనా కారణంగా నేతల అరెస్టులకు బ్రేక్ పడినప్పటికీ టీడీపీ నేతల్లో మాత్రం అరెస్టు గుబులు నెలకొందనే ప్రచారం జరుగుతోంది. ఎప్పుడేం జరుగుతుందోనని భయాందోళనలో టీడీపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.