https://oktelugu.com/

సూసైడ్‌ ఆర్‌ మర్డర్… సుశాంత్‌పై బయోపిక్‌

ఎంతో భవిష్యత్తు ఉన్న యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య బాలీవుడ్‌లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. మానసిక ఒత్తిడి కారణంగా సుశాంత్‌ బలవన్మరణం పాలవగా.. అందుకు కారణం అతనికి అవకాశాలు రాకుండా చేయడమే అన్న ఆరోపణలు వచ్చాయి. బాలీవుడ్‌ కొన్నికుటుంబాల గుప్పిట్లోనే ఉందని, వాళ్ల బంధువులకే అవకాశాలు ఇస్తూ.. ఇతరులను తొక్కేస్తున్నారని కంగనా రనౌత్‌ వంటి ప్రముఖులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. సుశాంత్‌ మరణించి నెల కావస్తున్నా ఈ వివాదం ఇంకా ముగియనే లేదు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 21, 2020 / 06:25 PM IST
    Follow us on

    ఎంతో భవిష్యత్తు ఉన్న యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య బాలీవుడ్‌లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. మానసిక ఒత్తిడి కారణంగా సుశాంత్‌ బలవన్మరణం పాలవగా.. అందుకు కారణం అతనికి అవకాశాలు రాకుండా చేయడమే అన్న ఆరోపణలు వచ్చాయి. బాలీవుడ్‌ కొన్నికుటుంబాల గుప్పిట్లోనే ఉందని, వాళ్ల బంధువులకే అవకాశాలు ఇస్తూ.. ఇతరులను తొక్కేస్తున్నారని కంగనా రనౌత్‌ వంటి ప్రముఖులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. సుశాంత్‌ మరణించి నెల కావస్తున్నా ఈ వివాదం ఇంకా ముగియనే లేదు. కాగా, సుశాంత్‌ ‌ జీవితం ఆధారంగా ఇప్పుడు ఓ సినిమా రాబోతోంది. ‘సూసైడ్‌ ఆర్‌ మర్డర్‌’ అనే టైటిల్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు బాలీవుడ్‌ నిర్మాత విజయ్‌ శేఖర్‌ గుప్తా ప్రకటించాడు. ‘ఎ స్టార్‌ వాజ్‌ లాస్ట్‌’ (ఓ స్టార్‌ని కోల్పోయాం) అనేది ట్యాగ్‌ లైన్‌ షామిక్‌ మాలిక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సుశాంత్‌ పాత్రలో సచిన్‌ తివారీ నటిస్తున్నాడు. అతని పస్ట్‌ లుక్‌ను కూడా రిలీజ్‌ చేశాడు. ఇందులో సచిన్‌ తివారీ అచ్చం సుశాంత్‌లా కనిపిస్తున్నాడు.

    Also Read: మణిరత్నం ‘నవరస’ సిరీస్‌లో తెలుగు స్టార్లు!

    బీహార్లోని మారుమూల గ్రామం నుంచి ఓ యువకుడు బాలీవుడ్‌లో మంచి నటుడిగా ఎదిగాడు.. అతని జీవితం ఎలా అంతమైంది అనే విషయాలను ఈ మూవీతో కళ్లకు కట్టనున్నారు. సుశాంత్‌ సూసైడ్‌కు కారణాలు, దాని వెనకున్న మిస్టరీని కూడా టచ్‌ చేయనున్నారు. అయితే, సుశాంత్‌ మృతిని క్యాష్‌ చేసుకోవడానికి తాను సినిమా తీయడం లేదనీ విజయ్‌ శేఖర్ చెప్పాడు. బాలీవుడ్‌లో బంధుప్రీతి, మాఫియా ప్రభావం ఎలా ఉంది? జియా ఖాన్‌, దివ్యభారతి మొదలుకుని సినీ నేపథ్యం లేకుండా చిత్రపరిశ్రమలోకి వచ్చిన వ్యక్తుల ప్రయాణం గురించి ప్రపంచానికి చెప్పడానికే తీస్తున్నట్లు స్పష్టం చేశాడు. సెప్టెంబర్ 16వ తేదీ నుంచి ముంబై, పంజాబ్‌లో యాభై రోజుల పాటు షూటింగ్‌ చేసేలా ప్లాన్‌ చేస్తోంది చిత్ర బృందం.