Kapu leaders: తన కుటుంబంపై వచ్చిన ఆరోపణలకు టీడీపీ అధినేత చంద్రబాబు కన్నీరు కార్చడంపై కాపు రిజర్వేషన్ల ఉద్యమ మాజీ నేత ముద్రగడ పద్మనాభం తాను రాసిన లేఖలో ఆరోపణలు చేశారు. తాను చేస్తే శృంగారం.. పక్కవాడు చేస్తే వ్యభిచారం అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. తనకు జరిగితే ఒకలా ఇంకొకరికైతే మరోలా స్పందించడం బాబుకు అలవాటే అని ఎద్దేవా చేశారు. తన కుటుంబాన్ని సర్వనాశనం చేసిన చంద్రబాబుకు ఏడ్చే హక్కు కూడా లేదని చెప్పుకొచ్చారు. ఎదుటివారి మనోభావాలు గౌరవించాల్సిన అవసరం అందరిపై ఉందని పేర్కొన్నారు.
టీడీపీలో కాపు నేతలు చాలా మంది ఉన్నా ముద్రగడ లేఖపై స్పందన లేదు. దీంతో వారిలో భయం పట్టుకుందని తెలుస్తోంది. చంద్రబాబుకు భయపడుతున్నారని తెలుస్తోంది. టీడీపీలో చినరాజప్పతో చాలా మంది ఉన్నా ఎవరు కూడా మాట్లాడలేదు. దీంతో ముద్రగడ ఒంటరైపోయారనే వాదన వినిపిస్తోంది. కాపు సామాజిక వర్గాల్లో స్పందన లేకపోయినా ఇతర వర్గాలు మాత్రం స్పందిస్తున్నాయి. ముద్రగడ లేఖ సంచలనంగా మారుతోంది.
వంగవీటి రాధా, బొండా ఉమామహేశ్వర్ రావు, నిమ్మల రామానాయుు, జ్యోతుల నెహ్రూ, గంటా శ్రీనివాస రావు, నారాయణ లాంటి కాపు నేతలున్నా వంగవీటికి మాత్రం సమాధానం చెప్పే సాహసం ఎవరు చేయడం లేదు. ఫలితంగా ముద్రగడకు తోడు ఎవరు లేరని తెలుస్తోంది. ఎవరి పదవిపై వారికే భయం ఉన్నందున మాట్లాడేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఒక వేళ వస్తే పరిస్థితి ఏంటనే దానిపైనే మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం.
Also Read: Janasena Pawankalyan:అమరావతి రైతుల పాదయాత్రకు పవన్ వెళ్లడట..!
మొదటి నుంచి కాపు సామాజిక వర్గంపై మంచి పట్టున్న చంద్రబాబు వారిని తమ ప్రధాన అనుచరులుగా చేసుకున్నారు. దీంతో వారు బాబు ఎంత చెబితే అంత ఏది చెబితే అదే మాట్లాడతారు. దీంతో ముద్రగడకు దీటైన నేత టీడీపీలో లేరని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బాబుపై పరోక్షంగా పోరాటం చేసినా ముద్రగడకు ఒరిగేదేమీ లేకపోవడం గమనార్హం. ఇన్నాళ్లు లేని సానుభూతి ఇప్పుడు కొత్తగా ఎక్కడ నుంచి వస్తుందనేదే ప్రశ్న.