BPNL Recruitment 2021: భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ప్లానింగ్ వాల్యూమ్ ఆఫీసర్ ఇతర ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 2325 ఉద్యోగ ఖాళీలను ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం. పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులభంగా దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా 2021 సంవత్సరం నవంబర్ 30వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. ప్లానింగ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలకు గ్రాడ్యుయేట్ కావడంతో పాటు మార్కెటింగ్ రంగంలో అనుభవం ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Also Read: సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?
ప్లానింగ్ వాల్యూమ్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలకు మార్కెటింగ్‌లో డిప్లొమా, మార్కెటింగ్‌లో అనుభవం ఉండి 12వ తరగతి పాస్ అయిన వాళ్లు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్లానింగ్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలకు మాత్రం మార్కెటింగ్‌లో డిప్లొమా, మార్కెటింగ్‌లో అనుభవం ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవాలి. మూడు ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు రుసుము వేర్వేరుగా ఉంటుందని తెలుస్తోంది.
ప్లానింగ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 590 రూపాయలు కాగా ప్లానింగ్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 826 రూపాయలు, ప్లానింగ్ వాల్యూమ్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 708 రూపాయలుగా ఉంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూలో పొందిన మార్కులను బట్టి ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. రాతపరీక్షకు 50 మార్కులు ఉండగా ఇంటర్వ్యూ 50 మార్కులకు ఉంటుంది.
Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీలో 31 ఉద్యోగాలు