Homeఆంధ్రప్రదేశ్‌Telangana Intellectuals- Jagan: జగన్ కు తెలంగాణ మేధావులు సలహాలు ఎందుకిస్తున్నారు?

Telangana Intellectuals- Jagan: జగన్ కు తెలంగాణ మేధావులు సలహాలు ఎందుకిస్తున్నారు?

Telangana Intellectuals- Jagan: అమరావతి రాజధాని విషయంలో జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయం విమర్శలపాలైంది. దేశవ్యాప్తంగా నేతలు జగన్ తీరును తప్పుపట్టారు. అయినా కూడా ఆయనలో మార్పురాలేదు. రాష్ట్రాన్ని రాజధాని లేకుండా నడిరోడ్డులో నిలిపారన్న అపవాదును ఆయన మూటగట్టుకున్నారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఆయన సహచర నాయకులు, అభిమానులు సైతం అమరావతిని ఏకైక రాజధాని చేయాలని ప్రకటించారు. అయినా ఆయన పెడచెవిన పెట్టారు. కానీ ఇప్పుడు తెలంగాణకు చెందిన మేథావులు, పలువురు మాజీ సీనియర్ న్యాయమూర్తులు హెచ్చరికలు జారీచేశారు. తీరు మార్చుకోకుంటూ మూల్యం చెల్లించుకుంటారని కూడా తేల్చిచెప్పారు. అమరావతి పరిరక్షణ సమితి ఉద్యమం ప్రారంభించి 900 రోజులు అయిన సందర్భంగా శనివారం విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో ‘హైకోర్టు తీర్పు – సర్కారు తీరు’ అనే అంశంపై జరిగిన చర్చావేదిక నిర్వహించారు. కార్యక్రమానికి మేథావులు, మాజీ న్యాయమూర్తులు వచ్చి రైతుల పోరాటానికి మద్దతు తెలిపారు.

Telangana Intellectuals- Jagan
Telangana Intellectuals

రైతులను మోసం చేసిన వైసీపీ సర్కారుకు ఒక్కరోజు కూడా అధికారంలో ఉండే అర్హత లేదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ గోపాల గౌడ పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం ఎందుకుండాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. రాజధాని అమరావతిపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును అమలు చేయని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అసలు చట్టబద్ధ పాలన సాగుతోందా? అని ప్రశ్నించారు.
లో జస్టిస్‌ గోపాలగౌడతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Also Read: TTD: భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక చర్యలు.. కాలినడక వచ్చే వారికి కార్పెట్

‘‘ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగించాలి. హైకోర్టు తీర్పులను అమలు చేసి గౌరవించాల్సిన బాధ్యత వాటిపై ఉందన్నారు.రైతులో పోరాటం కోర్టు తీర్పు నేపథ్యంలో అమరావతి నగరాన్ని అభివృద్ధి చేయడం మినహా ప్రభుత్వానికి ఇంకో దారి లేదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌, పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్‌ హరగోపాల్‌, సీపీఐ నేత నారాయణ తేల్చి చెప్పారు.

Telangana Intellectuals- Jagan
Jagan Mohan Reddy

ఇది రైతుల జీవనోపాధి, హక్కులకు సంబంధించిన అంశమన్న నేతలు ఉద్యమంతోనే వాటిని సాధించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని వారు స్పష్టం చేసారు. రైతుల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. న్యాయం కోసం ఉద్యమాలతో ముందుకెళ్లాల్సిందేనని, ప్రజా ఉద్యమాలు తప్ప వేరే మార్గం లేదన్నారు. ప్రజల్ని ఏడిపించి జగన్ ఏం సాధిస్తారని… సీపీఐ నేత నారాయణ జగన్‌ను ప్రశ్నించారు. ఏపీ మేధావుల మాటలను వినరు కానీ.. తెలంగాణ మేధావుల మాటలనైనా జగన్ వింటారేమో చూడాలి.

Also Read:Janasena Extended Party Level Meeting: జనసేన విస్తృత స్థాయి సమావేశంలో ఆమోదించిన తీర్మానాలేటి? ఏపీని ఎలా మార్చబోతున్నాయి?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper