Paradise Movie: నేచురల్ స్టార్ నాని హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది ప్యారడైజ్’ చిత్రం పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గ్లింప్స్ వీడియో విడుదలైనప్పటి నుండే ఈ చిత్రం పై అంచనాలు తార స్థాయిలో ఏర్పడ్డాయి. ఆ తర్వాత విడుదలైన ‘ఆయా షేర్’ పాటకు ఏ రేంజ్ సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అతి తక్కువ సమయం లోనే 250 మిలియన్ వ్యూస్ ని యూట్యూబ్ లో సొంతం చేసుకుంది ఈ పాట . ఆ తర్వాత ఇతర మ్యూజిక్ ప్లాట్ ఫార్మ్స్ లో కూడా ఈ పాటకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక రీసెంట్ గా విడుదలైన ‘ఏష నాగుల కట్టమీద’ పాటకు కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.
ఇలా ఈ చిత్రం నుండి విడుదల అవుతున్న ప్రతీ కంటెంట్ కి సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి వైల్డ్ ఫైర్ రేంజ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ కారణం చేత , ఇప్పటికే ఈ చిత్రం హైప్ తారా స్థాయికి చేరిపోయింది , అంతటి అంచనాలు ప్రమాదకరం అనుకున్నారో , ఏమో తెలియదు కానీ, ఈ సినిమాని ట్రైలర్ లేకుండానే విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఈమధ్య కాలం లో ఏ సినిమాని కూడా ట్రైలర్ లేకుండా విడుదల అవ్వలేదు. అప్పుడెప్పుడో విజయ్ మాస్టర్ సినిమాని మాత్రమే ఇలా విడుదల చేశారు. ఆ తర్వాత మళ్లీ ఈ చిత్రానికే జరగబోతుంది. అయితే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో నాని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఎందుకంటే ప్రస్తుత కాలం లో ఒక సినిమాకు బంపర్ ఓపెనింగ్స్ రావాలంటే ట్రైలర్ అత్యంత కీలకం.
అలాంటిది ఈ సినిమాకు ట్రైలర్ కట్ చేయకుంటేనే బెటర్ అనిపిస్తుందని మేకర్స్ డిసైడ్ అయ్యారంటే, కచ్చితంగా కంటెంట్ లో ఎదో తేడా ఉందని అర్థం అవుతోంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ కి ఆడియన్స్ నుండి నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ తో మరోసారి అలాంటి రెస్పాన్స్ వస్తే బాగుండదు అనే ఉద్దశ్యం తోనే ఈ నిర్ణయం తీసుకున్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై మేకర్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో రాబోయే రోజుల్లో చూడాలి.