CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. వైసీపీ అధినేత జగన్ తీసుకునే నిర్ణయాలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో పాత వారందరికి స్వస్తి చెప్పి కొత్త వారితోనే విస్తరణ ఉంటుందని సగం పాత సగం కొత్త వారితో కూర్చి మమ అనిపించారు. ఇప్పుడు కూడా రాజ్యసభ సభ్యుల ఎంపికలో కూడా ఎవరికి అర్థం కాని రీతిలో ఆలోచనలు చేస్తున్నారు ఇప్పటికే మూడు పదవులపై ముచ్చటగా ఓ అవగాహన ఉన్నా నాలుగో స్థానంపై అందరికి ఆశలు పెరుగుతున్నాయి. విజయసాయిరెడ్డికి రాజ్యసభ స్థానం కచ్చితమనే వాదనలు ఉన్నా ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. దీంతో అందరిలో ఉత్కంఠ కొనసాగుతోంది.
ఇటీవల ఓవార్త ఏపీలో చక్కర్లు కొడుతోంది ఆచార్య సినిమా నిర్మాత, చిరంజీవికి సుపరిచితుడైన వ్యక్తికి రాజ్యసభ పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి సదరు నిర్మాతకు కూడా జగన్ తో మంచి సంబంధాలు ఉన్నట్లు చెబుతున్నారు దీంతోనే ఆయన సూచన మేరకు అతడికి రాజ్యసభ సభ్యత్వం ఇస్తారనే వాదనలు వస్తున్నాయి కానీ అలాగైతే ఇద్దరు రెడ్లు ఉంటారనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. విజయసాయిరెడ్డికి రాజ్యసభ పదవి కచ్చితమని తెలిసినా మరో రెడ్డికి అవకాశం దక్కుతుందా అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగులుతోంది.
వైసీపీ నుంచే నలుగురు ఉండటంతో వారిలో విజయసాయిరెడ్డి ఒకరు కాగా గౌతమ్ అదానీ కుటుంబ సభ్యులకు ఒకరికి, మూడో స్థానం సినిమా రంగం నుంచి అనుకున్నా అలీకి ఇస్తారని భావిస్తున్నా అది ఇంకా ఖరారు కాలేదు. ఇక్కడే ఆచార్య సినిమా నిర్మాతకు కూడా అవకాశం ఉందని ఊహాగానాలు వస్తున్నాయి. దీంతోనే అలీకా నిర్మాతకా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. రాజ్యసభ సభ్యుల ఎంపికపై జగన్ ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం.
ఇక నాలుగో స్థానంపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు దీంతొ అందకిలోఉత్కంఠ నెలకొంది సీఎం జగన్ ఎవరికి అవకాశం ఇస్తారో ఎవరిని ఇంటికి సాగనంపుతారో తెలియడం లేదు. అందుకే నేతల్లో అనుమానాలు వస్తున్నాయి. ఏపీలో ఏర్పడిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్ నిర్ణయం ఎలా ఉంటుందోననే బెంగ అందరిలో పట్టుకుంది భవిష్యత్ కాలంలో తీసుకునే నిర్ణయాలతో పార్టీకి గుర్తింపు రావాలని చూస్తున్నారు. ఇందు కోసమే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎవరికి పదవులు దక్కుతాయో ఎవరికి చేదు అనుభవాలే మిగులుతాయో అంతుచిక్కడం లేదు.