Film Producer Dil Raju: మన ఇండస్ట్రీ లో క్రేజీ స్టార్ హీరో లతో సినిమాలు చేస్తూ తిరుగులేని నిర్మాతగా ఎదిగిన వ్యక్తి దిల్ రాజు..నైజం ప్రాంతం లో ఒక్క చిన్న డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ని ప్రారంబించి అతి తక్కువ సమయం లోనే స్టార్ నిర్మాతగా ఎదిగాడు..దర్శకుడిగా రాజమౌళి సినిమాలకి ఎలాంటి బ్రాండ్ వేల్యూ ఉంటుందో..దిల్ రాజు గారి సినిమాలకు కూడా అదే రేంజ్ బ్రాండ్ వేల్యూ ఉంటుంది అని అనడం లో ఎలాంటి సందేహం లేదు..నిర్మాతగా ఈయనకి ఉన్నటువంటి సక్సెస్ శాతం ఇండస్ట్రీ లో నేటి తరం నిర్మాతలలో ఎవ్వరికి లేదు అని చెప్పడం లో ఎలాంటి అతి సయోక్తి లేదు..కేవలం నిర్మాతగా మాత్రమే కాదు..డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఈయన లాగ సక్సెస్ లు చేసిన వారు ఎవ్వరు లేరు అనే చెప్పొచ్చు..ఇక ఈ ఏడాది నైజం ప్రాంతం లో స్టార్ హీరోల సినిమాలు వరుసగా కొన్నాడు..నేడు ఆ సినిమాలు అన్ని విడుదల అయ్యి డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు కి లాభాల వర్షంలో మునిగిపోయాడు.
గత ఏడాది డిసెంబర్ లో అఖండ సినిమా ని నైజం ప్రాంతం కి గాను దాదాపుగా 8 కోట్ల రూపాయలకు హక్కులను కొనుగోలు చేసాడు దిల్ రాజు..ఆ సినిమా ఫుల్ రన్ లో దాదాపుగా 20 కోట్ల రూపాయిలు నైజం ప్రాంతం నుండి వసూలు చేసి సంచలనం సృష్టించింది..అంటే దిల్ రాజు గారికి దాదాపుగా 12 కోట్ల రూపాయిలు లాభం అన్నమాట..ఇక ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన భీమ్లా నాయక్ సినిమా నైజం ప్రాంత హక్కులను కూడా దాదాపుగా 30 కోలా రూపాయలకు కొనుగోలు చేసాడు దిల్ రాజు..ఈ సినిమా ఇక్కడ ఫుల్ రన్ దాదాపుగా 36 కోట్ల రూపాయల షేర్ ని వసూలు చేసింది..అంటే ఈ సినిమా ద్వారా డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు గారికి ఆరు కోట్ల రూపాయిలు లాభాలు అన్నమాట..ఇక ఈ సినిమా తర్వాత వచ్చిన రాధే శ్యామ్ సినిమాకి కూడా డిస్ట్రిబ్యూటర్ అతనే..ఈ సినిమాకి మాత్రం ఈ ప్రాంతం లో దిల్ రాజు గారికి భారీ నష్టాలే మిగిలించింది..30 కోట్ల రూపాయలకు ఈ సినిమా హక్కులను కొనుగోలు చెయ్యగా..ఫుల్ రన్ లో కేవలం 23 కోట్ల రూపాయిలు మాత్రమే వసూలు చేసి దాదాపుగా 8 కోట్ల రూపాయిల నష్టాలను మిగిలించింది.
Also Read: Minister Roja: మిస్సయిన మంత్రి రోజా సెల్ ఫోన్. గంటల్లోనే గుర్తింపు.. మంత్రా మజాకా
ఇది దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR సినిమా నైజం ప్రాంత హక్కులను దిల్ రాజు దాదాపుగా 70 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసాడు..ఫుల్ రన్ లో ఈ సినిమా ఎవ్వరి ఊహించని విధంగా 110 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది..ఈ ఒక్క సినిమాకి గాను దిల్ రాజు కి ఈ ప్రాంతం లో 45 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి..ఇప్పటికి ఈ సినిమా ఈ ప్రాంతం లో విజయవంతంగా నడుస్తూ ఉండడం తో మరింత లాభాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది..#RRR తర్వాత వచ్చిన KGF చాప్టర్ 2 సినిమాని నైజం ప్రాంతం దిల్ రాజు నిజాం ప్రాంతం కమిషన్ బేసిస్ అగ్రిమెంట్ తో విడుదల చేసాడు..ఈ సినిమా ఆ ప్రాంతం లో సృష్టిస్తున్న విద్వాంసం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఇప్పటికే 36 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం ద్వారా దిల్ రాజు 18 కోట్ల రూపాయిల లాభాల్ని ఆర్జించాడు..ఫుల్ రన్ లో కచ్చితంగా ఈ సినిమా దిల్ రాజు కి మరో 10 కోట్ల రూపాయిల లాభాలు వచ్చే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాల అంచనా..అలా దిల్ రాజు పెట్టె ప్రతి సినిమా బంగారం లాగ మారి ఆయనకీ కాసుల కానక వర్షం కురిపిస్తుంది.
Also Read: CM Jagan Early Elections: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు.. ప్రణాళికలు సిద్ధం చేసిన సీఎం జగన్
Recommended Videos: