
Analysis on Afghan Crisis: అప్ఘనిస్తాన్ లోని కాబూల్ ఎయిర్ పోర్టు ఆత్మాహుతి దాడులతో రక్తసిక్తమైంది. అటు అప్ఘన్ ప్రజలు, ఇటు అమెరికా సైనికులు మరణించారు. మొత్తం 103 మంది మరణించగా.. అందులో అమెరికా సైనికులు 13మంది ఉండడం తీవ్ర విషాదం నింపింది. మరో దారుణం అంటేంటే.. ఇందులో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అప్ఘన్ లోని అనాదిగా జరుగుతున్న ఈ రక్త కన్నీరుకు అసలు ఎవరు బాధ్యులు..?
దశాబ్ధాలుగా అప్ఘనిస్తాన్ ఈ రక్త చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. దశాబ్ధాల క్రితమే ఈ రక్తకన్నీరు మొదలైంది. సోవియట్ యూనియన్ దశాబ్ధాల క్రితం అప్ఘనిస్తాన్ లోకి ప్రవేశించింది. అప్పుడు మొదలైన ఈ హింస ఇప్పటికీ కొనసాగుతోంది. సోవియట్ ను ఎదుర్కొనే క్రమంలో పుట్టుకొచ్చిన ముజాహిదీన్ ల చర్యలతో సామాన్య ప్రజలు ఎంతో మంది చనిపోయారు.
ఇక ఆ తర్వాత ముజాహిదీన్ లు, తాలిబన్లు, ఆల్ ఖైదా, ఐసిస్ ఉగ్ర గ్రూపులతో అప్ఘనిస్తాన్ లో రక్తపుటేరులు పారుతూనే ఉన్నాయి. ఇక అమెరికాపై అల్ ఖైదా 9/11 దాడులు చేసిన తర్వాత ఇది కొత్త మలుపు తిరిగింది. అమెరికా అప్ఘనిస్తాన్ పై దాడి చేసి అల్ ఖైదాను, దానికి ఆశ్రయించిన తాలిబన్లను ఏరివేశారు. కానీ 20 ఏళ్లు పాలించాక ఇక అప్ఘన్ నిర్మాణం మా పని కాదంటూ అమెరికా చేతులెత్తేసింది. ఇలా ఎవరికి వారు అప్ఘన్ రక్త చరిత్రలో పావులుగా మారిపోయారు. చివరకు ప్రజలనే సమిధలుగా చేశారు.
ప్రపంచమంతా అభివృద్ధి పథంలో పురోగతి సాధిస్తుంటే ఇంకా అప్ఘనిస్తాన్ లో ఈ ఆటవిక పాలన కొనసాగించాల్సిందేనా? దశాబ్ధాల అప్ఘన్ రక్తసిక్త పాలనకు అంతం లేదా? దీనికి పరిష్కారం ఏంటనే దానిపై స్పెషల్ ఫోకస్ వీడియో..
