https://oktelugu.com/

Mother, Daughter Rape: తల్లీ కూతుళ్లను వదలని కామాంధుడు

Mother, Daughter Rape: దేశంలో లైంగికదాడులు పెరిగిపోతున్నాయి. మహిళల కోసం ఎన్ని చట్టాలు వచ్చినా ఆకృత్యాలు ఆగడం లేదు. నిర్భయ, దిశ లాంటి చట్టాలు వచ్చినా మహిళలపై దాడులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీలో ఓ వివాహిత, ఆమె కూతురిపై (Daughter) లైంగిక దాడులు జరిగినట్లు ఫిర్యాదు చేయడంతో సభ్య సమాజం నివ్వెర పోతోంది. దేశంలో ఏదో ఒక చోట అత్యాచారాల (Rape) పరంపర కొనసాగుతూనే ఉందని తెలుస్తోంది. ఎన్ని రకాల నిర్బంధాలు వచ్చినా వారిని ఆపడం […]

Written By: , Updated On : August 27, 2021 / 03:54 PM IST
Follow us on

Mother, Daughter RapedMother, Daughter Rape: దేశంలో లైంగికదాడులు పెరిగిపోతున్నాయి. మహిళల కోసం ఎన్ని చట్టాలు వచ్చినా ఆకృత్యాలు ఆగడం లేదు. నిర్భయ, దిశ లాంటి చట్టాలు వచ్చినా మహిళలపై దాడులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీలో ఓ వివాహిత, ఆమె కూతురిపై (Daughter) లైంగిక దాడులు జరిగినట్లు ఫిర్యాదు చేయడంతో సభ్య సమాజం నివ్వెర పోతోంది. దేశంలో ఏదో ఒక చోట అత్యాచారాల (Rape) పరంపర కొనసాగుతూనే ఉందని తెలుస్తోంది. ఎన్ని రకాల నిర్బంధాలు వచ్చినా వారిని ఆపడం లేదు. ఉరిశిక్షలు విధించినా మనుషుల్లో మార్పు రావడం లేదు. ఫలితంగా అభాగ్యుల జీవితాలు అంధకారంలో పడిపోతున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలోని (Delhi) నాంగ్లోయ్ ప్రాంతంలో వసంత (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ తన కూతురుతో నివాసం ఉంటోంది. వసంత కూతురుకు 12 ఏళ్లు. అయితే వసంత నివాసం ఉంటున్న ఇంటి యజమాని సూరజ్ రాయ్ కన్ను ఆమెపై పడింది. ఎలాగైనా ఆమెను వశపరచుకోవాలని పథకం పన్నాడు. అవకాశం కోసం ఎదురు చూశాడు. సమయం కోసం గుంటనక్కలా కాచుకున్నాడు. ఓ సారి లొంగదీసుకోవాలని చూసినా ఆమె లొంగలేదు. దీంతో మరోసారి ప్రయత్నించాలని భావించాడు.

ఈ సందర్భంలో వసంత మేడ మీదికి వెళ్లింది. దీంతో ఇదే సమయం అనుకుని సూరజ్ రాయ్ మెల్లగా మేడ మీదికి వెళ్లి వసంతను ఇంట్లోకి లాక్కెళ్లి లైంగిక దాడి చేశాడు. తరువాత కింద ఇంట్లో ఉన్న వసంత కూతురుపై కూడా అత్యాచారం చేశాడు. అయితే తాను ఆయన బారి నుంచి తప్పించుకుని వచ్చి జరిగిన విషయం స్థానికులకు చెప్పడానికి ప్రయత్నించింది. పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది.

ఈ నేపథ్యంలో ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ పర్వీందర్ సింగ్ దీన్ని ధ్రువీకరించారు. అయితే వారిని ఆస్పత్రికి తరలించగా వైద్యం చేయడానికి వైద్యులు నిరాకరించగా పోలీసులు వెళ్లి సర్దిచెప్పడంతో తరువాత వైద్యం చేశారు. ఢిల్లీలో తల్లికూతుళ్లపై అత్యాచారం ఘటన సంచలనం సృష్టించింది.