spot_img
Homeఅంతర్జాతీయంKabul airport blasts: కాబూల్ పేలుళ్లు ఐసిస్ పనే.. సూసైడ్ బాంబర్ ఫొటో రిలీజ్

Kabul airport blasts: కాబూల్ పేలుళ్లు ఐసిస్ పనే.. సూసైడ్ బాంబర్ ఫొటో రిలీజ్

IS claims responsibility for Kabul airport blastsKabul airport blasts: కాబూల్ (Kabul) నగరం బాంబులతో (Bomb Blast) దద్దరిల్లింది. గురువారం సాయంత్రం జరిగిన ఈ చర్యతో దేశం యావత్తు ఉలిక్కిపడింది. తాలిబన్లు (Taliban) అనుమానించినట్లుగానే ఐఎస్ ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ పేలుళ్ల బాధ్యత తమదేనని ఐఎస్ ఉగ్రవాదులు ప్రకటించారు. పేలుళ్లలో దాదాపు 60 మంది మరణించగా 150 మంది గాయపడ్డారు. మొదటి పేలుడు బారన్ హోటల్ వద్ద, రెండో పేలుడు కాబుల్ విమానాశ్రయం వద్ద జరిగాయి. దీంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి.

అఫ్గాన్ పేలుళ్లకు (afghan blasts) తమదే బాధ్యత అని ఐఎస్ ఉగ్రవాదులు ప్రకటించారు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి ఫొటోను కూడా విడుదల చేశారు. ఈ రెండు పేలుళ్లతో పాటు మరో రెండు పేలుళ్లకు కుట్ర పన్నినట్లు పేర్కొంది. మూడో పేలుడు తాలిబన్ వాహనాన్ని పేల్చివేసిందని తెలిపింది. మృతుల్లో నలుగురు యూఎస్ మెరైన్స్ కూడా ఉన్నారు. ముగ్గురు అమెరికా సైనికులు కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. అధ్యక్షుడు జో బైడెన్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని పేర్కొన్నారు.

మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. ఎటు చూసినా ఆర్తనాదాలే వినిపించాయి. విమానాశ్రయం మొత్తం దద్దరిల్లిపోయింది. భీతావహ వాతావరణం నెలకొంది. ఎవరి దేశాలకు వారు వెళ్లేందుకు జనం పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకోవడంతో వారినే లక్ష్యంగా చేసుకుని ఐఎస్ ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడడం తెలిసిందే.

ఆగస్టు 31వరకు తరలింపు గడువు విధించడంతో వేలాది మంది ప్రజలు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈనేపథ్యంలో ఉగ్రవాదులు దాడికి పాల్పడడంతో భారీ ప్రాణనష్టం జరిగింది. గురువారం ఉదయం ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని అమెరికా వర్గాలు వెల్లడించడంతో కొద్ది గంటల సమయంలోనే ఉగ్రవాదులు దాడులకు తెగబడటం సంచలనమైంది.

అమెరికా ఇప్పటికే ఉగ్రదాడి జరగవచ్చని హెచ్చరించిన నేపథ్యంలో పేలుళ్లు జరగడంతో పౌరులు ఉలిక్కిపడ్డారు. ఉగ్రవాద దాడులపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అన్ని దేశాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. సిగ్గుమాలిన చర్యగా అభివర్ణిస్తున్నారు. నిందితులను చట్టం ముందు నిలబెడతామని తాలిబన్ అధికార ప్రతినిధి మహిల్ షాహిన్ పేర్కొన్నారు.

 

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper
Exit mobile version