Uttar pradesh Elections 2022: దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం.. ఇక్కడ గెలిచిన పార్టీ దేశంలో అధికారంలో వస్తుంటుంది. మేజిక్ మార్క్ సీట్లు సాధించాలంటే ఉత్తరప్రదేశ్ లో ఎంపీ సీట్లను గెలుచుకుంటే చాలు అన్నట్టుగా దేశ రాజకీయాలు నడుస్తున్నాయి. అందుకే అక్కడ ఏం జరిగినా వార్తే. ఏం చేసినా సంచలనమే. ఉత్తరప్రదేశ్ కోసం రాజకీయ పార్టీలు ఏమైనా చేస్తుంటాయి. అక్కడ గెలుపుకోసం సామధాన భేద దండోపాయాలు వినియోగిస్తుంటాయి. తాజాగా రైతులపైకి బీజేపీ నేతల కారెక్కించాక ఇన్నాళ్లు బీజేపీ వైపు ఉన్న రాజకీయంగా అనూహ్యంగా మారుతోంది. రైతుల్లో ఒకరకమైన అభద్రతా, ద్వేషం, బీజేపీపై పెరుగుతోందన్న టాక్ వినిపిస్తోంది.మరి యూపీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది? పార్టీల స్వరూపం ఎలా ఉంది..? వచ్చే ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపనుంది..? అనే అంశాలపై స్పెషల్ ఫోకస్..
కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలో భాగం నలుగురు రైతులు ఇటీవల దుర్మరణం చెందారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ సంఘటనలో బీజేపీ సహాయ మంత్రి కుమారుడు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. అయితే దీనిపై పూర్తిగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ పేరు మారుమోగుతోంది. యూపీలో జరిగిన ఈ సంఘటన వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయా..? అన్ని చర్చ సాగుతోంది. ఎందుకంటే వచ్చే ఏడాదిలో ఇప్పుడున్న ప్రభుత్వం గడువు తీరనుంది. దీంతో ముందుగానే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ స్వరూపం గురించి పార్టీల బలబలాల గురించి తెలుసుకుందాం.
దేశంలో విస్తీర్ణంలో ఉన్న అతిపెద్ద రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఒకటి. దేశజనాభాలో ఉత్తరప్రదేశ్ లో 16.7 శాతం మంది ఇక్కడే నివసిస్తున్నారు. అంటే 14.52 కోట్ల మంది ఓటర్లున్నారు. ఈ రాష్ట్రంలో 75 జిల్లాలు ఉన్నాయి. 404 అసెంబ్లీ సీట్లు, 80 లోక్ సభ, 31 మంది రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. శాసన మండలిలో 100 మంది ఉన్నారు. 403 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా ఒకరు రాష్ట్రపతి ప్రతిపాదించిన ఆంగ్లో ఇండియన్ ఉంటారు. ఇక ప్రభుత్వం ఏర్పాటుకు 202 మంది సభ్యుల బలం ఉంటే సరిపోతుంది. ఇంతకంటే తక్కువగా ఏ పార్టీకి ఉన్నా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి.
2022 మార్చి 14 ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రద్దు కానుంది. అంటే ఆ లోపే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అధికార, ప్రతిపక్ష పార్టీలు రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. జనసంఖ్య, రాజకీయ అవగాహన, చారిత్రక నేపథ్యం ఉన్న ఈ రాష్ట్రం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇప్పటి నుంచే ప్రచారం మొదలు పెట్టింది. ప్రతిపక్షాలు ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజలకు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న తాగునీటి సమస్యపై నిలదీస్తున్నారు. అలాగే నిరుద్యోగ సమస్య ఎన్నటికీ తీరడం లేదు. ప్రతీ ఎన్నికల్లో యువతకు ఉద్యోగాలు కల్పిస్తామంటున్న పార్టీలు ఆ తరువాత తమ హామీలను మరిచిపోతున్నారు.
కరోనా కారణంగా దేశం అతలాలకుతలమైంది. అయితే ఉత్తరప్రదేశ్‌లోనూ కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. కరోనా కారణంగా ఇక్కడి చేనేత కార్మికులు ఉపాధి కోల్పోయారు. చేనేత కార్మికులు ఎక్కువగా వారణాసిలోనే ఉన్నారు. కాగా వారణాణి నియోజకవర్గం నుంచే మోదీ ప్రధానిగా వ్యవహరిస్తున్నారు. ఈ నియోజకవర్గాన్ని టోక్యోలాగా మారుస్తామని హామీ ఇచ్చిన మోదీ ఆ విషయం గురించి పట్టించుకోలేదు. అలాగే ఆధ్వానంగా ఉన్న రోడ్లు ప్రయాణికులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇక బుందేల్ ఖండ్ లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఈ ప్రాంతంపై అనేక మంది రాజకీయ నాయకులు ఎన్నో ప్రకటనలు చేశారు. అయినా ఈ ప్రాంతం గురించి పట్టించుకోవడం లేదు.
ఉత్తరప్రదేశ్‌లో ప్రధానంగా మూడు పార్టీలు ఉన్నాయి. అధికారంలో ఉన్న బీజేపీతో పాటు సమాజ్ వాద్ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ లు ఉన్నాయి. కాంగ్రెస్ ఉన్నాదాని బలం తక్కువే. 2017లో ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 312 సీట్లు గెలిచింది. సమాజ్ వాదీ పార్టీ 47 సీట్లు, బీఎస్పీ 19, కాంగ్రెస్ కేవలం ఏడు సీట్లకే పరిమితం అయింది. అయితే ఉత్తరప్రదేశ్‌లో ఎన్ని పార్టీలు ఉన్నా పొత్తుల విషయంపై ఎక్కువగా పట్టించుకోరు. విడివిడిగానే పోటీ చేస్తారు. అయితే కాంగ్రెస్ సమాజ్ వాదీ పార్టీతో పొత్తుపెట్టుకున్నా కలిసి రావడం లేదని ఇరు పార్టీల నాయకులు అంటున్నారు. అందుకే ఈసారి కాంగ్రెస్ కు దూరంగా ఎస్పీ, బీఎస్పీ ఒక్కటవుతున్నాయి. ఇక కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. ఇక ఈసారి ప్రియాంకగాంధీ ఇక్కడి పార్టీ బాధ్యతలు చేపట్టనున్నారు.మరి యూపీ ఎన్నికల్లో ప్రస్తుతానికి బీజేపీ బలంగా ఉంది. కానీ ఓటర్లు ఎటు మారుతారన్నది చెప్పలేం.. ఎస్పీ-బీఎస్పీ కూటమికి చాన్స్ ఉంటుందని చెబుతున్నారు. ఏం జరుగుతుందనేది వేచిచూడాలి.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Which party is going to win the uttar pradesh 2022 elections
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com