MLA Nagaraju: ఆరు హామీలు అంటూ.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. వాటిని దశలవారీగా అమలు చేస్తోంది .. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలు మొత్తం అమలు చేస్తామని చెప్పి.. ఇప్పుడు వాటి అమల్లో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. ప్రభుత్వం చేస్తున్న తీరు ప్రజల్లో ఆగ్రహాన్ని కారణమవుతోంది. ఆ హామీలు కూడా అంతంతమాత్రంగా అమలు చేస్తుండడం ప్రజల్లో అసహనానికి దారితీస్తోంది. దీంతో ప్రభుత్వం పై ప్రజలు మండిపడుతున్నారు. అమలు చేసే స్థాయి లేనప్పుడు హామీలు ఎందుకు ఇచ్చారని.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు.
Also Read: సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు మమతా కి షాక్
రైతు భరోసా నిధుల విషయంలోనూ.. రైతు రుణమాఫీ విషయంలోనూ.. ప్రభుత్వం నూటికి నూరు శాతం రైతులకు మేలు చేయలేకపోయిందని ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి ఆరోపిస్తోంది. మంత్రులు కూడా పలు సందర్భాల్లో రైతు భరోసా, రైతు రుణాల మాఫీని పూర్తిస్థాయిలో చేయలేకపోయామని చెప్పడం ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితికి వరంగా మారింది. ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో భారత రాష్ట్ర సమితి నాయకులు ప్రస్తావిస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్ నాయకులు కూడా భారత రాష్ట్ర సమితి నాయకులకు సరైన స్థాయిలోనే కౌంటర్ ఇస్తున్నారు. కెసిఆర్ హయాంలో రైతుబంధును దశలవారీగా ఇచ్చింది నిజం కాదా అంటూ గులాబీ నాయకులకు ఇచ్చి పడేస్తున్నారు. ఇలా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి నాయకుల మధ్య సంవాదం జరుగుతూనే ఉంది.
ఎమ్మెల్యే మధ్యలో వెళ్లిపోయారు
హామీల అమలు విషయంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు మాత్రమే కాదు ప్రజలు కూడా ఆ గ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఈ అనుభవం ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుకు ఎదురయింది. పర్వతగిరి మండలం లో జై బాపు, జై భీమ్, జై సం విధాన్ యాత్రలో కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగరాజును హామీలపై ప్రజలు నిలదీశారు. ” 6 గ్యారంటీలు అంటూ మోసం చేశారు. గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమయ్యారు.. ఇప్పుడేమో మా మధ్యకు వచ్చారు. ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడికి వెళ్లాయి. రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారు. ఓట్లు ఆగడానికి వచ్చినప్పుడు కచ్చితంగా బుద్ధి చెప్తాం.. మా ఓటుతో గెలిచి.. హామీలు అమలు చేస్తామని చెప్పి.. ఇప్పుడేమో ఇలా చేస్తున్నారు. ఆరోజు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చినప్పుడు తెలియలేదా.. వాటిని అమలు చేయడంలో ఎందుకింత నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని” నాగరాజును ప్రజలు నిలదీశారు. ప్రజలకు సర్ది చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ వారు వినిపించుకోలేదు. దీంతో నాగరాజు మధ్యలో నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన దృశ్యాలను భారత రాష్ట్ర సమితి అనుకూల సోషల్ మీడియా తెగ ప్రచారం చేస్తోంది. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకులు గతంలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీసిన వీడియోలు, వార్తలను కౌంటర్ గా పోస్ట్ చేస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలోనూ ఎన్నికల కాలం నాటి వాతావరణాన్ని గుర్తు చేస్తున్నారు.
హామీలు అమలు కావడం లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఉరికించిన ప్రజలు
వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజును హామీలపై నిలదీసిన ప్రజలు
ఆరు గ్యారంటీలంటూ మోసం చేశారని, హామీలు అమలు చేయకుంటే ఓట్లు… pic.twitter.com/UzSKysQzpc
— Telugu Scribe (@TeluguScribe) April 5, 2025