Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Naidu : చంద్రబాబుకు పాదాభివందనం చేసిన వైసీపీ ఎమ్మెల్సీ!

Chandrababu Naidu : చంద్రబాబుకు పాదాభివందనం చేసిన వైసీపీ ఎమ్మెల్సీ!

Chandrababu Naidu : కొందరు నేతల వ్యవహార శైలి భిన్నంగా ఉంటుంది. రాజకీయంగా కూడా వారి చర్యలు భిన్నంగానే కనిపిస్తాయి. అవసరాల కోసం పార్టీ మారడం.. తీరా అదే అవసరాల కోసం వెనక్కి తగ్గడం చూస్తుంటాం. ఇలాంటి సమయంలో నేతలు అధినేతల ప్రాపకం కోసం చేయని ప్రయత్నం అంటూ ఉండదు. అటువంటి ప్రయత్నమే చేశారు వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జయ మంగళం వెంకటరమణ( YSR Congress MLC jayammangalam venkatramana ). ఏకంగా సీఎం చంద్రబాబు కు పాదాభివందనం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read : చంద్రబాబు నోట ‘పి4’ మాట.. దీని ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా?

* సీఎం పోలవరం ప్రాజెక్టు సందర్శన
సీఎం చంద్రబాబు( CM Chandrababu) పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. దీంతో కూటమి నేతలు ఆయనకు స్వాగతం పలికారు. ఈ క్రమంలో వైసిపి ఎమ్మెల్సీ జయమాంగళం వెంకటరమణ చంద్రబాబును చూసి నమస్కరించారు. కాలికి దండం పెట్టారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు జయమంగళం వెంకటరమణ. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. అటు తరువాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యారు. అయితే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆయనకు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. అయితే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో జయ మంగళం వెంకటరమణ జనసేన లో చేరారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినా ఆమోదానికి నోచుకోలేదు.

* టిడిపి ద్వారా ఎంట్రీ
1999లో తెలుగుదేశం పార్టీలోకి ( Telugu Desam Party)ఎంట్రీ ఇచ్చారు జయ మంగళం వెంకటరమణ. 2005లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కైకలూరు జడ్పిటిసిగా ఎన్నికయ్యారు. 2009లో కైకలూరు టికెట్ దక్కించుకొని ఎమ్మెల్యే అయ్యారు. 2014లో కైకలూరు సీటును బిజెపికి పొత్తులో భాగంగా కేటాయించారు. 2019లో మాత్రం టిడిపి టికెట్ పై పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరగా ఎమ్మెల్సీ పదవి దక్కింది.

* టిడిపిలో చేరుతారు అనుకుంటే..
అయితే జయ మంగళం వెంకటరమణ టిడిపిలో చేరుతారని అంతా భావించారు. ప్రస్తుతం కైకలూరు( Kaikaluru ) ఎమ్మెల్యేగా కామినేని శ్రీనివాస్ ఉన్నారు. ఆయన బిజెపి నేత. అయితే జయ మంగళం వెంకటరమణ టిడిపిలో చేరకుండా… జనసేన లో చేరడంతో అంత ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఏకంగా టిడిపి అధినేత చంద్రబాబుకు పాదాభివందనం చేసి అందర్నీ ఆశ్చర్యంలో పడేశారు. తద్వారా చంద్రబాబు కు తనపై ఉన్న అభిప్రాయాన్ని మార్చడానికి ఇలా చేశారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Also Read : చిన్నోళ్లు అందరూ చలికి తట్టుకోలేకపోతున్నారు.. ఈ వయసులో “బాబు” డ్రెస్ చూడండి!

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular