లోకేష్ కు సైకిల్ ఎక్కాలని ఆశ!

అధికారం పోయినప్పటికి కూడా తనే ముఖ్యమంత్రిని అని చంద్రబాబు భావిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి అన్నారు. ఒక భ్రాంతికి లోనవుతూ తనే సీఎం ని అనుకుని వీడియోకాన్ఫరెన్స్ లు, జూమ్ కాన్ఫరెన్స్ లు పెడుతున్నట్లు చెప్పారు. తాను సలహాలు ఇవ్వబట్టే కేంద్రంలో నరేంద్రమోదిగారు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని చూపుతాడన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడారు. రాజకీయ విలువలు, మానవతా విలువలు, కుటుంబ విలువలు లేనటువంటి ఒకే ఒక వ్యక్తి బాబు అని […]

Written By: Neelambaram, Updated On : April 20, 2020 5:48 pm
Follow us on


అధికారం పోయినప్పటికి కూడా తనే ముఖ్యమంత్రిని అని చంద్రబాబు భావిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి అన్నారు. ఒక భ్రాంతికి లోనవుతూ తనే సీఎం ని అనుకుని వీడియోకాన్ఫరెన్స్ లు, జూమ్ కాన్ఫరెన్స్ లు పెడుతున్నట్లు చెప్పారు. తాను సలహాలు ఇవ్వబట్టే కేంద్రంలో నరేంద్రమోదిగారు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని చూపుతాడన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడారు. రాజకీయ విలువలు, మానవతా విలువలు, కుటుంబ విలువలు లేనటువంటి ఒకే ఒక వ్యక్తి బాబు అని చెప్పారు.

విపత్కర పరిస్థితిలోను రాజకీయ విమర్శలు చేస్తూ అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని దూషిస్తూ మానవజాతికే కీడు తెస్తున్న వ్యక్తి, రాక్షస ప్రవర్తన కలిగిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. రోజుకు ఒక లెటర్ రాస్తాడని, తను నిర్వహించే వీడియోకాన్ఫరెన్స్ లలో కొంతమంది తనకు కావాల్సిన వారిని పిలిపించుకుంటాడని తెలిపారు. ఎక్కడో హైదరబాద్ లో కూర్చుని ప్రజలకు ద్రోహం చేస్తున్నాడనే విషయం మరిచిపోవడం శోచనీయమన్నారు.

చంద్రబాబు అనే వ్యక్తి చంద్రముఖిగా ఎందుకు మారిపోయాడనే అనుమానం వచ్చి డాక్టర్లను, సైకియాటిస్ట్ లను, మేధావులను సంప్రదించానని చెప్పారు. ముత్యాలముగ్గు సినిమా ప్రతినాయకుడు రావు గోపాలరావు పరిస్థితి లాగా చంద్రబాబు పరిస్థితి మారిందని చెప్పారు.

బాబు నిజంగా లాక్ డౌన్ లో ఉన్నాడా లేక లాకప్ లో ఉన్నాడా అనే సందేహం కలుగుతోందన్నారు. కొడుకు లోకేష్ నిక్కరు వేసుకుని సైకిల్ తొక్కుతున్న అపురూప దృశ్యాలు వీడియో కాన్ఫరెన్స్లో బయట పడ్డాయన్నారు. చిన్నబాబు సైకిల్ తొక్కాలని ఆశ ఉందని, పెద్దబాబు సైకిల్ దిగడం లేదన్నారు. దిగాలనే ఉద్దేశ్యం లేదని చెప్పారు. చంద్రబాబు కూర్చుంటే సైకిల్ కదలదని, చిన్నబాబు కూర్చుంటే సైకిల్ బతకదని ఎద్దేవా చేశారు.