పవన్ కి 20, మహేష్ కి 2

ఈ మధ్య హిట్ సినిమాలకి వార్షికోత్సవాలు చేయడం మామూలై పోయింది. అలాంటి తరుణం లో ఇవాళ ఇద్దరు టాప్ స్టార్స్ నటించిన చిత్రాలకు వార్షికోత్సవ దినం కావడం విశేషం తండ్రి కడసారి వీడ్కోలుకు సీఎం దూరం! పవన్ కళ్యాణ్ నటించిన `బద్రి `సినిమాకి ఇరవై ఏళ్ళు వచ్చాయి. సరిగ్గా 20 ఏళ్ళ క్రితం మిల్లీనియమ్ ప్రారంభం లో ఏప్రిల్ 20 వ తారీఖున బద్రి సినిమా వచ్చి సంచలన విజయం సాధించింది . కాగా ఈ చిత్రం […]

Written By: admin, Updated On : April 21, 2020 4:10 pm
Follow us on

ఈ మధ్య హిట్ సినిమాలకి వార్షికోత్సవాలు చేయడం మామూలై పోయింది. అలాంటి తరుణం లో ఇవాళ ఇద్దరు టాప్ స్టార్స్ నటించిన చిత్రాలకు వార్షికోత్సవ దినం కావడం విశేషం

తండ్రి కడసారి వీడ్కోలుకు సీఎం దూరం!

పవన్ కళ్యాణ్ నటించిన `బద్రి `సినిమాకి ఇరవై ఏళ్ళు వచ్చాయి. సరిగ్గా 20 ఏళ్ళ క్రితం మిల్లీనియమ్ ప్రారంభం లో ఏప్రిల్ 20 వ తారీఖున బద్రి సినిమా వచ్చి సంచలన విజయం సాధించింది . కాగా ఈ చిత్రం తోనే పూరీ జగన్నాధ్ దర్శకుడిగా వెండితెరకు పరిచయ మయ్యాడు అలాగే రేణు దేశాయ్ కి కూడా ఇదే మొదటి చిత్రం. ఈ చిత్రం పూర్తి అయ్యాకే రేణు దేశాయ్ , పవన్ కళ్యాణ్ ల వివాహం జరిగింది అలా ఈ సినిమా పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ , పూరీ జగన్నాధ్ లకు .ఒక మెమొరబుల్ మూవీ గా నిలిచి పోయింది.

లోకేష్ కు సైకిల్ ఎక్కాలని ఆశ!

సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం ఇదే ఏప్రిల్ 20 న మహేష్ బాబు నటించిన `భరత్ అనే నేను ` చిత్రం విడుదలై ఘన విజయం అందుకొంది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. కాగా ఈ భరత్ అనే నేను చిత్రం ద్వారా కియారా అద్వానీ తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అలాగే మహేష్ బాబు , కొరటాల శివ కాంబో లో ఇది రెండో చిత్రం. శ్రీమంతుడు చిత్రం తరవాత వాళ్లిద్దరూ కలిసి చేసిన ఈ చిత్రానికి ఆర్ధిక విజయం తో పాటు , విమర్శకుల ప్రశంసలు కూడా బాగానే వచ్చాయి ఆ విధంగా భరత్ అనే నేను చిత్రం మహేష్ బాబు కి మెమొరబుల్ మూవీ అయ్యింది …