Homeజాతీయ వార్తలుRadical Network India: యూపీ ఏటీఎస్‌ రాడికల్‌ నెట్‌వర్క్‌.. హిందువు పేరుతో ఉగ్ర కార్యకలాపాలు!

Radical Network India: యూపీ ఏటీఎస్‌ రాడికల్‌ నెట్‌వర్క్‌.. హిందువు పేరుతో ఉగ్ర కార్యకలాపాలు!

Radical Network India: పాకిస్తాన్‌ భారత దేశంలో ఉగ్ర కార్యకలాపాల విస్తరణకు హిందువులను టార్గెట్‌ చేస్తోంది. పేదరికం ఆసరాగా చేసుకుని డబ్బులు ఆశచూపి ర్యాడికలైజేషన్‌ చేస్తోంది. దేశంలో అల్లర్లు, దాడులకు ఉసిగొల్పుతోంది. అతంటి కుట్రను తాజాగా ఉత్తరప్రదేశ్‌ యాంటీ–టెర్రరిజం స్క్వాడ్‌ (ఏటీఎస్‌) బయటపెట్టింది.

సోషల్‌ మీడియా ఉగ్రవాదానికి గేట్‌వే
ఇన్‌స్టాగ్రామ్‌లో ’తుషార్‌ చౌహాన్‌’ అనే హిందూ యువకుడిగా కనిపించే ప్రొఫైల్‌ను చూసిన ఏటీఎస్, పాకిస్తాన్‌ ఆధారిత రాడికల్స్, ఇన్‌ఫ్లూయెన్సర్లతో అనుమానాస్పద కనెక్షన్లు గమనించింది. లోతైన దర్యాప్తులో ఇది హిజ్బుల్లా అలీఖాన్‌ అనే వ్యక్తి అనుకోవడం బయటపడింది. షెహబాజ్‌ భట్, ఆదిల్‌ జాక్‌ వంటి గ్యాంగ్‌స్టర్లతో (పాక్‌ ఐఎస్‌ఐ లింకులు) సంబంధాలు ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌ వంటి ప్లాట్‌ఫామ్‌లు రిక్రూటర్లకు హంటింగ్‌ గ్రౌండ్‌గా మారాయి.

తుపాకీ, గ్రెనేడ్‌ స్వాధీనం..
విచారణలో హిజ్‌బుల్లా అలీఖాన్‌ నుంచి తుపాకీలు, పేలుడు పదార్థాలు స్వాదీనం చేసుకుంది. ఇతని స్నేహితుడు ఢిల్లీకి చెందిన సమీర్‌ అలీఖాన్‌తో లింకులు బయటపడ్డాయి. భారత టార్గెట్‌లపై గ్రెనేడ్‌ దాడులకు రూ.3 లక్షల చెల్లిస్తారు. దాడికి ముందు రూ.50 వేలు, తర్వాత మిగతా మొత్తం ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. దాడి తర్వాత నోయిడా (దెహ్రాడూన్‌ సమీపంలో) నుంచి నేపాల్, దుబాయ్, పాకిస్తాన్‌కు ఎస్కేప్‌ ప్లాన్‌లు రూపొందించారు.

పెద్ద నెట్‌వర్క్‌..
తెహ్రీక్‌–ఎ–తాలిబాన్‌ హిందుస్తాన్‌తో సంబంధాలు బయటపడ్డాయి. సమీర్‌ వాల్‌ రైటింగ్‌ల ద్వారా ప్రచారం చేశాడు. అల్‌ఫలాక్‌ యూనివర్సిటీలో ’మెడికల్‌ జిహాద్‌’ పాక్‌ సానుభూతి, భారత వ్యతిరేక పోస్టర్లతో బయటపడింది. ముస్లిం యువకులను సోషల్‌ మీడియా ద్వారా రాడికలైజ్‌ చేయడం అతని పని. యూపీ ఏటీఎస్‌ మొత్తం నెట్‌వర్క్‌ను డిస్‌మాంటిల్‌ చేసింది.

సాధారణ యూజర్లుగా కనిపించి కమ్యూనిటీల్లోకి చొరబడి, డబ్బు ఇచ్చి దాడులు చేయడం కొత్త ట్రెండ్‌. మాఫియా డాన్స్‌లు, ఫేక్‌ ఐడీలు, జిహాద్‌ కాల్స్‌ మిక్స్‌ అవుతున్నాయి. భారత ప్రభుత్వం ఏఐ డిటెక్షన్, ఏజెన్సీల మధ్య ఇంటెల్‌ పంచుకోవడంపై దృష్టి పెడుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular