Undavalli Sridevi
Undavalli Sridevi: తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి యాస, భాషను మార్చారు. మొన్నటివరకు జగనన్న తన గుండెల్లో ఉన్నాడని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఇప్పుడేమో తన వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్నారని చెప్పుకొస్తున్నారు. గౌరవమైన వైద్య వృత్తిలో ఉండి మాస్ డైలాగులతో ముంచెత్తుతున్నారు. తనకేమీ పీకలేరంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. సడన్ గా ఈ డాక్టర్ వైఖరిలో మార్పు చూసినవారు.. ఊసరవెల్లి కంటే ఉండవల్లి రంగులు మార్చారంటూ సెటైర్లు పడుతున్నాయి. ఆ భాష, యాస ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
నారా లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగా అమరావతి ఆవేదన సభ నిర్వహించారు. సడన్ గా సభకు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి హాజరయ్యారు. కార్యక్రమానికి యాంకర్ గా కూడా వ్యవహరించారు. వైసిపి గుర్తుపై గెలిచినందుకే తాను అమరావతి ఉద్యమానికి మద్దతు తెలపలేకపోయానని గుర్తు చేశారు. తన వెనుక చంద్రబాబు, లోకేష్ లు ఉన్నారని.. వారి ఆధ్వర్యంలో అమరావతి ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నానని.. తనకు వైసీపీ నేతలు ఎవరూ ఏం పీకలేరు అంటూ శ్రీదేవి వ్యాఖ్యానించారు. అయితే ఈ కామెంట్స్ పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇన్నాళ్లు అమరావతి ఉద్యమాన్ని అణచివేసింది మీరు కాదా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అమరావతి రైతులను పెయిడ్ ఆర్టిస్టులుగా పోల్చింది ఎమ్మెల్యే శ్రీదేవి అని ఉద్యమకారులు గుర్తు చేస్తున్నారు. అలాంటి ఎమ్మెల్యేను రాజకీయ అవసరాల కోసం వేదికపై ఎక్కించి ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనిని టిడిపి శ్రేణులే జీర్ణించుకోలేకపోతున్నాయి.
మరోవైపు ఎమ్మెల్యే శ్రీదేవి వైఖరి పై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగుతోంది. ఏమి పీకలేరు అన్న వ్యాఖ్యలపై చాలామంది మండి పడుతున్నారు. నువ్వు ఎమ్మెల్యేవు తల్లీ,పైగా డాక్టర్ వృత్తిలో ఉన్నావు.. కొంచెం ఆలోచించుకుని మాట్లాడు అంటూ నెటిజెన్లు సలహా ఇస్తున్నారు. మరికొందరైతే చంద్రబాబు నీకు అన్ని పీకుతాడని.. పీకడంలో ఆయనే సిద్ధహస్తుడని.. పిల్లనిచ్చిన మామను, బావమరుదులను, తోడల్లుడునే పీకిన చరిత్ర చంద్రబాబుదని.. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకో అని సలహా ఇస్తున్నారు. ఆ పీకుడు ముందు మరొకరు పీకలేరని.. ఆయనతోనే పీకించుకోవాలని సెటైర్లు వేస్తున్నారు. ఇప్పుడు అవే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆకట్టుకుంటున్నాయి
చంద్రబాబు వాడకం ఎలా ఉంటాదో ముందు ముందు చూద్దువుగానీ మేకప్ మేడం.. #PoliticalTerroristCBN pic.twitter.com/NJSCQ5PBbe
— Vikatakavi (@vikatakavi1231) August 14, 2023