spot_img
Homeఎంటర్టైన్మెంట్Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన 'జన నాయగన్ ' వసూళ్లు.....

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్ వచ్చిందంటే..

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘జన నాయగన్ ‘ నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ‘భగవంత్’ కేసరి కి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది. కానీ విజయ్ చివరి చిత్రం కావడంతో , ఈ సినిమాకు ఓపెనింగ్ వసూళ్లు మాత్రం బాగానే వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి ఈ చిత్రానికి 80 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. విజయ్ రేంజ్ కి ఇది చాలా తక్కువే. కానీ విడుదలకు ముందే ఈ సినిమా లీక్ అయ్యింది, అనేక సార్లు వాయిదాలు పడుతూ వచ్చింది. ఆ కారణం చేత మామూలు ఆడియన్స్ ఈ చిత్రాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఈ మాత్రం ఓపెనింగ్స్ కూడా విజయ్ చివరి చిత్రం , ముఖ్యమంత్రి అయ్యాక విడుదల అవుతుండడం వల్లే, ఆ మాత్రం అయినా వచ్చింది.

లేదంటే కమర్షియల్ గా 50 కోట్ల గ్రాస్ వసూళ్లు రావడం కూడా కష్టమే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇకపోతే ఈ సినిమా టాక్ ప్రభావం రెండవ రోజున చాలా గట్టిగానే పడింది. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి 14 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా లైవ్ ఆన్లైన్ ట్రాకింగ్ ద్వారా ఈ చిత్రానికి ఇప్పటి వరకు 18 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. సెకండ్ షోస్ ముగిసేసరికి 22 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వొచ్చు. ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ లలో మొదటి రోజే ఈ చిత్రానికి ఓపెనింగ్స్ ఘనంగా రాలేదు, ఇక రెండవ రోజు అయితే రెంట్స్ కూడా రీకవర్ అవ్వని పరిస్థితి.

విజయ్ కి కంచు కోటగా పిలవబడే కేరళ లో కూడా ఈ చిత్రానికి పెద్దగా వసూళ్లు నమోదు అవ్వడం లేదు. విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ప్రాంతం లో వసూళ్లు నమోదు అయ్యేలా కనిపిస్తోంది. అదే విధంగా ఓవర్సీస్ లో కూడా రెండవ రోజు వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి రెండవ రోజున 25 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే నమోదు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయట. ఇండియా మొత్తం మీద ఈ చిత్రానికి డీసెంట్ వసూళ్లు రెండవ రోజు నమోదు అవుతున్న ప్రాంతం తమిళనాడు మాత్రమే. ఇక్కడి నుండి రెండవ రోజున 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...
Oktelugu Epaper
Exit mobile version