Pawan Kalyan: బ్రేకింగ్ : పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కన్ఫామ్.. క్లారిటీ వచ్చేసింది

ప్రస్తుతం పవన్ వారాహి యాత్ర విశాఖలోని గాజువాకలో సాగుతోంది. యాత్రకు జన స్పందన విశేషంగా ఉంది. జనాలు స్వచ్ఛందంగా పోటెత్తుతున్నారు. దీంతో పవన్ లో కూడా ఆనందం వెల్లివిరుస్తోంది.

Written By: Dharma, Updated On : August 14, 2023 4:42 pm

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న దానిపై క్లారిటీ లేదు. పవన్ పోటీ చేసేందుకు దాదాపు పది నియోజకవర్గాలు సిద్ధంగా ఉన్నాయి. కానీ పవన్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన గాజువాక నుంచి బరిలో దిగడమా? లేకుంటే భీమవరం నుంచి పోటీ చేయడమా? ఏదైనా కొత్త నియోజకవర్గమా? అన్నది తేల్చుకోలేకపోతున్నారు. అయితే ఎక్కడికక్కడే లోకల్ క్యాడర్ మాత్రం పవన్ కు ఆహ్వానాలు పలుకుతోంది. అయితే తాజాగా వారాహి 3.0 యాత్రలో ఉన్న పవన్ తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు. కానీ అందులో కూడా పూర్తిస్థాయిలో స్పష్టతనివ్వలేదు.

ప్రస్తుతం పవన్ వారాహి యాత్ర విశాఖలోని గాజువాకలో సాగుతోంది. యాత్రకు జన స్పందన విశేషంగా ఉంది. జనాలు స్వచ్ఛందంగా పోటెత్తుతున్నారు. దీంతో పవన్ లో కూడా ఆనందం వెల్లివిరుస్తోంది. తాను ఓడినా కూడా తనకు ఇంత పెద్ద ఎత్తున ఘనస్వాగతం లభించడం ఆనందంగా ఉందని పవన్ ప్రకటించారు. అసలు గాజువాక ప్రజలు 2019లో తనను ఎందుకు ఓడించారు అర్థం కాలేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. తనను గెలిపించి ఉంటే ఎంతో బాగుండేదన్నారు. అసలు గెలిచిన ఎమ్మెల్యేలు,ఎంపీలు ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నించారు. 2024 ఎన్నికల్లో గాజువాకలో జనసేన గెలిచి తీరుతుందని పవన్ స్పష్టం చేశారు. అయితే జనసేన అభ్యర్థి ఎవరనే దానిపై మాత్రం పవన్ క్లారిటీ ఇవ్వలేదు.

అయితే లోకల్ క్యాడర్ మాత్రం పవన్ గాజువాక నుంచి బరిలో దిగాలని బలంగా కోరుకుంటుంది. ఓడిపోయాడు ఓడిపోయాడు అన్న ఆరోపణను బలంగా తిప్పి కొట్టాలంటే ఇక్కడ నుండే పోటీ చేసి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గా గెలవాలని కోరుకుంటున్నారు.వాస్తవానికి జనసేనకు సంస్థాగత బలమున్న నియోజకవర్గాల్లో గాజువాక ఒకటి. గత ఎన్నికల్లో పవన్ ను ఓడించామన్న బాధ నియోజకవర్గ ప్రజల్లో ఉంది. అందుకే క్షేత్రస్థాయిలో మాత్రం పవన్ గాజువాక నుంచి పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. అత్యధిక మెజారిటీ కట్టబెట్టి గెలిపిస్తామని కూడా చెబుతున్నారు.కానీ పవన్ మాత్రం ఈ విషయంలో ఇంకా స్పష్టత ఇవ్వలేదు. వచ్చే ఎన్నికల్లో గాజువాకలో జనసేన గెలుస్తుంది అన్న మాటకే పరిమితమయ్యారు.