spot_img
Homeజాతీయ వార్తలుJantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్ రాజకీయాలు ఉండవు. హిందుత్వ నినాదం విషయంలో బిజెపి కాంప్రమైజ్ కాదు. బహిరంగంగానే హిందువుల గురించి సానుకూలంగా మాట్లాడుతూ ఉంటుంది. తమది హిందుత్వ పార్టీ అని చెప్పేస్తుంటుంది.

అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం విశ్వహిందూ పరిషత్.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఎలా అయితే కృషి చేశాయో.. బిజెపి కూడా అదే స్థాయిలో కష్టపడి పని చేసింది. క్షేత్రస్థాయిలో రామ మందిర నిర్మాణ ఆవశ్యకతను దేశ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలిగింది. రామ మందిర నిర్మాణాన్ని కూడా గొప్పగా ఉండేలా చేసింది. కాకపోతే నిర్వాహక కమిటీ నిర్లక్ష్యం వల్ల భారతీయ జనతా పార్టీ తలదించుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ రామ మందిర నిర్వహణలో జరుగుతున్న అక్రమాలపై నిజాలు బయట పెట్టడానికి ఏకంగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఇప్పటికే చాలామందిని అరెస్ట్ చేసింది.

భారతీయ జనతా పార్టీకి.. రాముడికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఈ సంబంధమే ఆ పార్టీని దేశంలో మూడుసార్లు అధికారంలోకి రాగలిగేలా చేసింది. దీనిని దెబ్బ కొట్టడానికి విపక్ష పార్టీలు చేయని ప్రయత్నం అంటూ లేదు. తాజాగా అయోధ్య వ్యవహారంలో విపక్ష పార్టీలు గొంతు సవరించడం మొదలుపెట్టాయి. భారతీయ జనతా పార్టీని కార్నర్ చేయడం మొదలు పెట్టాయి. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఒక దశ లో భారతీయ జనతా పార్టీకి మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడిక జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ధర్నా విషయంలో కూడా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు రామ నామాన్ని జపించారు.

ఒక చేతిలో జైశ్రీరామ్ అని రాసిన ఫ్ల కార్డు.. మరో చేతిలో విప్లవం వర్ధిల్లాలి అనే ప్లకార్డు పట్టుకున్నారు. సీజేపీ నాయకులు ఇలా చేస్తారని కమలం పార్టీ నాయకులు అసలు ఊహించలేదు. పైగా బిజెపి నాయకులకు కౌంటర్ ఇవ్వడానికి కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు అనేక రకాల విధాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. సోషల్ మీడియాను విపరీతంగా వాడుకున్నారు. దీంతో వారు చేస్తున్న ధర్నాకు విశేషమైన ప్రాచుర్యం లభించింది. ప్రతిపక్షాలు కూడా ఆలోచించని విధంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఆలోచించడం ఆసక్తికరంగా మారింది. అయితే ఎన్ని రకాలుగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ప్రయత్నాలు చేసినప్పటికీ.. భారతీయ జనతా పార్టీ ఐటి విభాగం అత్యంత లోతుగా వీడియోలు.. వ్యవహారాలను బయటకు తీయడంతో.. కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఆశించిన లక్ష్యాలు మాత్రం నెరవేరలేదు అని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇన్ని రోజుల వరకు రాముడు కేవలం బిజెపి నాయకులకు మాత్రమే ఇలవేల్పులాగా ఉండేవారు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు రాముడిని తమ అవసరాల కోసం వాడుకోవడం మొదలుపెట్టారు. తద్వారా బిజెపి నాయకులకు షాకిచ్చారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...
Oktelugu Epaper
Exit mobile version