Astrology: భారతదేశం సాంప్రదాయాలకు నిలయం. పురాతన కాలం నుంచి కొన్ని పనులు ఆచార, సాంప్రదాయాలను భట్టే చేస్తుంటారు. అప్పుడు సరైన పద్ధతులు పాటించిన వారు 90 ఏళ్లకు పైగా జీవించారు. కానీ ఇప్పుడు వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. కనీసం చెప్పినా వినడం లేదు. అయితే ఇప్పటి యువత నిత్యం సోషల్ మీడియాలోనే ఉండడంతో జ్యోతిష్యులు సాంప్రదాయాల గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇలా ఓ పండితుడు చెప్పిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన చెబుతున్న ప్రకారం వారంలో మూడు ఆ రోజుల్లో క్షవరం చేయించుకోకూడదట. ఆయా రోజుల్లో హెయిర్ సెలూన్ కు వెళ్లి హెయిర్ కటింగ్ చేయించుకుంటే ఆయుష్షు తగ్గుతుందట. మరి ఆ రోజులు ఏవో చూద్దామా..
పురుషులు హెయిర్ కటింగ్, షేవింగ్స్ చేసుకోవడం కామన్. కొందరు ప్రతిరోజూ..మరికొందరు వారంలో ఒకసారి క్షవరం చేయించుకుంటారు. ఉద్యోగం, వ్యాపారం బిజీలో పడి ఎప్పుడు పడితే అప్పుడు క్షవరం చేయించుకుంటారు. కొందరు ఇళ్లల్లో సేవింగ్స్ చేసుకున్నా.. హెయిర్ కటింగ్ కోసం మాత్రం తప్పనిసరిగా సెలూన్ కు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రత్యేక రోజుల్లో క్షవరం చేసుకోవడం వల్ల జీవితకాల ఆయుష్షు తగ్గుతుందని అంటున్నారు.
సాధారణంగా అందరికీ ఆదివారం సెలవు ఉంటుంది. దీంతో ఉదయం లేచి క్షవరం చేయించుకోవడానికి సెలూన్ కు వెళ్తుంటారు. ఆదివారం ప్రతీ సెలూన్ షాప్ బిజీగా ఉంటుంది. అయితే ఆదివారం క్షవరం చేయించుకోవడం వల్ల ఒక మాసం ఆయుష్షు తగ్గుతుందట. కానీ దీనిపై మరికొందరు పండితులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఆదివారం క్షవరం చేయించుకుంటే ఒక నెల ఆయుష్షు పెరుగుతుందని అంటున్నారు. అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
శనివారం క్షవరం చేయించుకుంటే 7 నెలలు, మంగళవారం చేసుకుంటే 8 నెలల ఆయుష్సు తగ్గుతుందట. వీటిల్లో మంగళవారం ఎలాగూ సెలూన్ షాపులు మూసివేసే ఉంటాయి. కానీ శనివారం కూడా చాలా మంది క్షవరం చేసుకోవాలని చూస్తారు. ఇలా చేయడం వల్ల ఆయుష్సు తగ్గుతుందని అంటున్నారు. అంటే ఆది, మంగళ, శనివారాలు కాకుండా మిగతా రోజుల్లో క్షవరం చేసుకోవచ్చని, ఇలా చేయించుకోవడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని కొందరు చెబుతున్నారు.