Site icon OkTelugu

Nara Lokesh: ఎంట్రోయ్.. లోకేష్ లో ఈ యాంగిల్ కూడా ఉందా? వైరల్ వీడియో

Nara Lokesh

Nara Lokesh

Nara Lokesh: సొంత నియోజకవర్గ మంగళగిరిలో పర్యటిస్తున్నారు మంత్రి నారా లోకేష్. గత రెండు రోజులుగా ఆయన పర్యటన కొనసాగుతోంది. నియోజకవర్గంలో దాదాపు 3,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు కూడా. లబ్ధిదారులకు నూతన వస్త్రాలతో పాటు పసుపు కుంకుమలతో పట్టాలు పంపిణీ చేయడం విశేషం. ఇంకోవైపు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తల్లికి వందనం లబ్ధిదారులతో కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా లోకేష్ ఓ విద్యార్థితో ఆసక్తికరంగా మాట్లాడారు. ఏంటి అల్లరి చేస్తున్నావ్.. హెయిర్ స్టైల్ ఇలా ఉందేంటి అంటూ ఆడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గత కొద్దిరోజులుగా లోకేష్ ఎక్కడికి వెళ్తున్న అక్కడున్న వారితో మమేకమవుతూ కనిపిస్తుండటం విశేషం.

* ఇళ్ల పట్టాల పంపిణీ..
మంగళగిరి నియోజకవర్గంలోని పేద కుటుంబాలకు సొంత ఇంటి కలను సాకారం చేయాలని లక్ష్యంతో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మంగళగిరి బైపాస్ రోడ్ లోని సీకే కన్వెన్షన్ లో రెండు రోజులపాటు కార్యక్రమం కొనసాగింది. నియోజకవర్గంలో అర్హులైన పేద కుటుంబాలకు ఇళ్లపట్టాలను అందజేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్ల స్థలాలు అందేలా చర్యలు చేపడతామని లోకేష్ స్పష్టం చేశారు. మంగళగిరిని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేసే బాధ్యతలు తీసుకుంటానని కూడా స్పష్టం చేశారు.

* విద్యార్థిని దగ్గరకు తీసుకుని..
తల్లికి వందనం లబ్ధిదారులతో మాట్లాడే క్రమంలో ఓ విద్యార్థి లోకేష్ కు కనిపించాడు. సదరు విద్యార్థి హుషారుగా ఉండడంతో లోకేష్.. అల్లరి చేస్తున్నావ్ అంటూ వ్యాఖ్యానించారు. నీ హెయిర్ స్టైల్ ఇలా ఉంది ఏంట్రా అంటూ పలకరించారు. ఆ విద్యార్థినిని దగ్గరకు తీసుకుని ముచ్చటించడం అందర్నీ ఆకట్టుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. నెటిజెన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version