spot_img
Homeజాతీయ వార్తలుTRS MLAs Purchase Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. టీఆర్‌ఎస్‌కు గట్టి షాక్‌!

TRS MLAs Purchase Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. టీఆర్‌ఎస్‌కు గట్టి షాక్‌!

TRS MLAs Purchase Case: తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్‌ పోలీసులకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే రెండు దఫాలుగా.. బీఎల్‌.సంతోష్‌కు ఇచ్చిన నోటిసులపై హైకోర్టు స్టే విధించింది. తాజాగా బండి సంజయ్‌ అనుచరుడు, కరీంనగర్‌ అడ్వకేట్‌ శ్రీనివాస్‌కు ఇటీవల సిట్‌ నోటీసులు ఇచ్చింది. నోటీసుల ప్రకారం శ్రీనివాస్‌ సిట్‌ విచారణకు కూడా హాజరయ్యాడు. అయితే శ్రీనివాస్‌ను విచారించిన సిట్‌ ఏ7గా అతడిని చేరుస్తు మెమోదాఖలు చేసింది. కానీ పోలీసులు నమోదు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేసింది.

TRS MLAs Purchase Case
TRS MLAs Purchase Case

నిన్న అలా.. నేడు ఇలా..
ఇక టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ అగ్రనేత బీఎల్‌. సంతోష్, జగ్గుస్వామికి తెలంగాణ హైకోర్టులో సోమవారం ఊరట లభించింది. ఈ కేసులో వీరిపై సిట్‌ జారీ చేసిన నోటిసులపై స్టేను డిసెంబర్‌ 13 వరకు పొడిగించింది. మొదట ఈ నోటీసులపై సంతోష్‌ హైకోర్టును ఆశ్రయించగా.. డిసెంబర్‌ 5 వరకు నోటిసులపై స్టే విధించింది. దీనితో సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు డిసెంబర్‌ 13 వరకు స్టేను పొడిగించింది. మరోవైపు జగ్గుస్వామి సిట్‌ లుకౌట్‌ నోటిసులపై హైకోర్టు ఆశ్రయించారు. దీనితోపాటు నోటిసులపై స్టేను కూడా హైకోర్టు పొడిగించింది. మంగళవారం శ్రీనివాస్‌ను ఏ7గా చేరుస్తూ దాఖలు చేసిన మోమోనూ ఏసీబీ కోర్టు కొట్టేసింది.

వరుస పరిణామాలతో టీఆర్‌ఎస్‌లో టెన్షన్‌..
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోజురోజుకు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ తరువాత ఈ ఘటనకు సంబంధించి ఆడియో, వీడియోలను సీఎం కేసీఆర్‌ బయటపెట్టి మరో సంచలనానికి తెర లేపారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ పట్టుబట్టింది. కానీ ఈ కేసును దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ తో కూడిన సిట్‌ ఏర్పాటు చేసింది. ఈ సిట్‌ ఏపీ, తెలంగాణతోపాటు కేరళ , కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లో సోదాలు చేసింది. ఈ సోదాల్లో కీలక సమాచారం రాబట్టిన సిట్‌ మరికొందరికి నోటీసులు ఇచ్చింది. అందులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌.సంతోష్, కేరళకు చెందిన తుషార్, జగ్గుస్వామి, బండి సంజయ్‌ అనుచరుడు శ్రీనివాస్, నిందితుల్లో ఒకరైన నందకుమార్‌ భార్య చిత్రలేఖ, అంబర్‌పేట లాయర్‌ ప్రతాప్‌గౌడ్‌ ఉన్నారు.

TRS MLAs Purchase Case
TRS MLAs Purchase Case

అయితే సిట్‌కు వరుస షాకులు తగులుతున్న నేపథ్యంలో కేసీఆర్‌ ఎలాంటి స్టెప్‌ తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరోవైపు టీఆర్‌ఎస్‌ నేతల్లో టెన్షన్‌ పెరుగుతోంది. కోర్టు తీర్పులు బీజేపీకి అనుకూలంగా వస్తుండడం, మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థల ముందు సిట్‌ తేలిపోతుండడంతో తర్వాత ఏం జరుగుతుందో అన్న భయం గులాబీ నేతల్లో కనిపిస్తోంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Avinash Reddy

Avinash Reddy: కడప నుంచి అవినాష్ రెడ్డి ఔట్!

Avinash Reddy: కడప విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. కడప ఎంపీ సీటు విషయంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డికి ఈసారి మొండి చేయి చూపుతారు...
YSRCP

YSRCP: లోకేష్ కు టచ్ లో ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు?!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది నేతలు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. కూటమిలో ఛాన్స్ దక్కకపోవడంతో చాలామంది వేచి చూస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నామంటే ఉన్నాం అన్నట్టు వ్యవహరిస్తున్న...
US Iran War

US Iran War: ఇరాన్‌తో యుద్ధం.. దివాలా తీస్తున్న అమెరికా!

US Iran War: తన సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష తీర్చుకోవడానికి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కిరణ్తో యుద్ధం మొదలుపెట్టాడు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోది. యుద్ధం కారణంగా ఇరాన్...
Jana Nayagan Advance Bookings

Jana Nayagan Advance Bookings: అడ్వాన్స్ బుకింగ్స్ లో అంచనాలు అందుకోలేకపోయిన ‘జన నాయగన్’..ఎంత గ్రాస్ వచ్చిందంటే..

Jana Nayagan Advance Bookings: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' ఎట్టకేలకు అడ్డంకులను దాటుకొని , రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ...
NTR

NTR God of War Movie: ‘గాడ్ ఆఫ్ వార్’ మూవీ.. ఎన్టీఆర్ సంచలనం…

NTR God of War Movie: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గాడ్ ఆఫ్ వార్' అనే సినిమా అనౌన్స్ అయింది. అయితే ఈ సినిమాను పురాణాల నేపథ్యంలో తెరకెక్కించాలని...
Oktelugu Epaper