Omicron variant: కరోనా కల్లోలం మనం ప్రత్యక్షంగా చూశాం. ఎన్నో ఇబ్బందులు అనుభవించాం. కానీ ఇప్పటికి కూడా దాని ప్రభావం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. కొవిడ్ ప్రభావంతో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయిన సంగతి తెలిసిందే. దీంతో విద్యావ్యవస్థలైతే పలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఇప్పటికి ఎదుర్కొంటూనే ఉణ్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల చదువుపై ప్రభావం కనిపించింది.

ఇటీవల కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావంతో డిసెంబర్ 2 నుంచి విద్యాసంస్థలు బంద్ చేస్తారని వస్తున్న పుకార్లపై తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు. విద్యాసంస్థల బంద్ కు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
కరోనా కట్టడికి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగిస్తోంది. దీంతోనే కరోనా వ్యాప్తి కట్టడి జరిగినట్లు తెలుస్తోంది. ఇందు కోసమే ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రజలు కూడా భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు విధిగా ధరించాలని సూచిస్తోంది. ఇందుకోసం ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతోంది.
Also Read: Paddy Grain Procurement: వరిధాన్యం కొనుగోళ్ల వివాదంలో తప్పెవరిది..? కేంద్రానిదా..? రాష్ట్రానిదా..?
మరోవైపు విద్యాసంస్థల్లో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చేస్తోంది. విద్యాసంస్థల్లో పనిచేసే సిబ్బంది సైతం అప్రమత్తంగా ఉండాలని మార్గదర్శకాలు జారీ చేసింది. టీకాలు వేయడంతో వైరస్ ప్రభావం కూడా తగ్గినట్లు తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ప్రజలు నమ్మవద్దని సూచిస్తున్నారు.
మహారాష్ర్టలోని నాగపూర్ లో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు విద్యాసంస్థలను మూసివేశారు. మరోవైపు పుణె తదితర ప్రాంతాల్లో కూడా ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తుదని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో మరోమారు కరోనా దాడి చేస్తుందని భావించి ప్రభుత్వాలు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడంతో విద్యాబోధనపై ప్రభావం చూపుతోంది.