https://oktelugu.com/

Ram Gopal Varma: సిరివెన్నెల మృతిపై స్పందించిన వర్మ.. పొరపాటున నేను స్వర్గానికి వస్తే అమృతంతో పెగ్ వేద్దాం అంటూ ఎమోషనల్!

Ram Gopal Varma: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించారన్న వార్త తెలియడంతో సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులు సిరివెన్నెల సీతారామశాస్త్రి వారి అనుబంధం గుర్తుచేసుకొని ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీతారామశాస్త్రి మృతిపై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. వర్మ దర్శకత్వం వహించిన శివ సినిమాలోని బాటనీ పాటముంది.. మ్యాటనీ ఆట ఉంది.. అంటూ సాగే ఈ పాటను సిరివెన్నెల […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 1, 2021 / 11:34 AM IST

    rgv-comments-on-seetharamasastry

    Follow us on

    Ram Gopal Varma: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించారన్న వార్త తెలియడంతో సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులు సిరివెన్నెల సీతారామశాస్త్రి వారి అనుబంధం గుర్తుచేసుకొని ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీతారామశాస్త్రి మృతిపై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. వర్మ దర్శకత్వం వహించిన శివ సినిమాలోని బాటనీ పాటముంది.. మ్యాటనీ ఆట ఉంది.. అంటూ సాగే ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించారు.

    Ram Gopal Varma

    Also Read: త్రివిక్రమ్​ను ఓదార్చిన పవన్​కళ్యాణ్​.. సిరివెన్నెల భౌతికగాయానికి నివాళి

    శివ సినిమా విడుదలైన తర్వాత ఈ పాట ఎంతో మంచి ఆదరణ దక్కించుకుంది. అప్పటి నుంచి సీతారామశాస్త్రి వర్మ మద్య మంచి బంధం ఏర్పడిందని చెప్పవచ్చు. ఇలా వీరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉండడంతో ఆయన మరణించారన్న వార్త తెలియగానే వర్మ ఎంతో ఎమోషన్ అయ్యారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ ద్వారా సిరివెన్నెలతో తనకున్న అనుబంధం గురించి చెప్పుకుంటూ ట్విట్టర్ ఖాతాలో ఓ ఆడియో ఫైల్‌ను పెట్టారు.

    ఈ క్రమంలోనే సీతారామశాస్త్రితో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. ఇలా తనతో తనకున్న పరిచయంతో తనకోసం తను రాసిన పాటల గురించి గుర్తు చేసుకున్నారు.సిరివెన్నెల భౌతికంగా మన మధ్య దూరం అయిన ఆయన అందించిన అద్భుతమైన పాటలు ఎల్లవేళలా మనతోనే ఉంటాయని చెప్పుకొచ్చారు. ఇక ఇప్పటి వరకు సీతారామశాస్త్రి గారు చేసిన మంచి పనుల వల్ల తప్పకుండా ఆయన స్వర్గానికి వెళ్తారు. అక్కడ రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమలకు హాయ్ చెప్పండి. ఎన్నో పాపాలు చేశాను కనుక నేను తప్పకుండా నరకానికి వెళ్తాను కాకపోతే యముడి లెక్కలలో పొరపాట్లు ఉంటే స్వర్గానికి వస్తే కనుక అక్కడ ఇద్దరం కలిసి అమృతంతో పెగ్ వేద్దామని ఆయనతో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు.

    Also Read: సిరివెన్నెల గారు మనల్ని వదిలివెళ్ళడం ఎంతో బాధాకరం: రాజమౌళి