Homeజాతీయ వార్తలుJaishankar on global trade: జైశంకర్ తో మామూలుగా ఉండదు.. అమెరికాకే గుణపం దించాడుగా..?

Jaishankar on global trade: జైశంకర్ తో మామూలుగా ఉండదు.. అమెరికాకే గుణపం దించాడుగా..?

Jaishankar on global trade: అమెరికా అధ్యక్షుడు కొన్ని రోజులుగా తరచూ ఇరాన్‌పై యుద్ధం చేస్తానని పదే పదే ప్రకటిస్తున్నాడు. ఇరాన్‌ అణుకార్యక్రమాలు ఆపాలని ఒత్తిడి చేస్తున్నాడు. ఇప్పటికే యుద్ధ నౌకలను ఇరాన్‌ చుట్టూ మోహరించాడు. అయితే యుద్ధం చేయడానికి మాత్రం వెనుకాడుతున్నాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇరాన్‌పై యుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. ఇది కేవలం సైనిక చర్య కాదు, ప్రపంచ ఇంధన వ్యవస్థను మార్చే భారీ కుట్ర. సూయిజ్‌ కాలువను అవరోధించి మధ్యప్రాచ్య దేశాల జల రవాణాను ఆపేసి, అమెరికా తన చేతుల్లోకి తీసుకోవాలనే ఉద్దేశం. దీని పర్యవసానంగా గ్లోబల్‌ ఆయిల్‌ సరఫరా దెబ్బతింటుంది, ధరలు ఆకాశాన్ని తాకుతాయి.

భారత్, చైనాపై ప్రభావం..
ఆయిల్‌ సరఫరా ఆపేస్తే చైనా, భారత్‌ వంటి పెద్ద దేశాలు తీవ్రంగా దెబ్బలు తింటాయి. వెనెజువెలా వంటి ఉత్పాదకులు కూడా అమెరికన్‌ ఇంధనం కొనాల్సి వస్తుంది. ఈ దృశ్యాన్ని ముందుగా గుర్తించాడు మన విదేశాంగ మంత్రి జైశంకర్‌. జర్మనీ సదస్సులో ఆయన స్పష్టంగా వెల్లడించారు. ఇది అమెరికా ఆధిపత్య ఆట అని కుండ బద్దలు కొట్టాడు.

Also Read: భారతదేశంలో అత్యధికంగా చింతపండు పండించే రాష్ట్రాలు ఇవే..

భారత్‌–మిడిల్‌ ఈస్ట్‌ ఎకనామిక్‌ కారిడార్‌..
అమెరికా ఆధారాలకు లొంగకుండా భారత్‌ కొత్త మార్గం రూపొందించింది. ఇండియా–మిడిల్‌ ఈస్ట్‌–యూరప్‌ ఆర్థిక కారిడార్‌ ద్వారా యూఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, గ్రీస్‌ మధ్య సముద్ర–స్థల మార్గాలు ఏర్పాటు. ఇది సూయిజ్‌పై ఆధారపడకుండా ఇంధనం, వస్తువుల రవాణా నడపుతుంది. ఇప్పటికే భారత్‌ నుంచి యూరప్‌కు రైలు ట్రాక్‌ల పాట ఫైబర్‌ నెట్‌వర్క్‌ విస్తరిస్తోంది. యుద్ధాలు రాన్నప్పటికీ సమాచార ప్రవాహం అలాగే ఉంటుంది. మిడిల్‌ ఈస్ట్‌కు గ్రీన్‌ శక్తి, డిజిటల్‌ సాంకేతికతలు భారత్‌ సమకూరుస్తుంది. బెహ్రైన్, ఖతార్‌లో పనులు వేగవంతం చేయాలని జైశంకర్‌ ఆదేశాలు.

ఈ కారిడార్‌ అమెరికా ప్లాన్‌ను పోగొట్టుతుంది. సూయిజ్‌ దిగ్బంధన ఉన్నా భారత వాణిజ్యం ప్రభావితం కాదు. ఆయిల్‌ ధరలు పెరిగినా ప్రత్యామ్నాయ మార్గాలు లభిస్తాయి. భారత్‌ మాత్రమే కాక, ఆసియా–యూరప్‌ వ్యాపారం స్థిరపడుతుంది.

జైశంకర్‌ ’హనుమంతుడు’ లాంటి వ్యూహకారుడిగా ప్రధాని మోదీకి నిలబడ్డారు. ట్రంప్‌ ఆలోచనలకు బలమైన అడ్డంకి. భవిష్యత్తులో ఇది భారత ఆర్థిక శక్తిని మరింత పెంచుతుంది, ప్రపంచ రాజకీయాల్లో మన స్థానాన్ని బలోపేతం చేస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version