Narendra Modi health secrets: పుతిన్ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. అతనికి సంబంధించిన అనారోగ్య విషయం మిగతా దేశాలకు తెలియకూడదని రష్యా జాగ్రత్త పడుతోంది. అతడి వ్యర్ధాలను సైతం భద్రత సిబ్బంది వెంట తీసుకెళ్తున్నారు. ఇక ట్రంప్ ఆరోగ్యం కూడా అంత మాత్రమే. ఇటీవల అతడు రెండు రోజులపాటు బయటికి కనిపించలేదు. అతడు తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కూడా అనారోగ్యంతోనే ఇబ్బంది పడుతున్నాడు. అతనికి సంబంధించిన ఏ విషయాన్ని కూడా బయట పెట్టడానికి ఉత్తర కొరియా సిద్ధంగా లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచ దేశాల అధినేతలు ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు.. కానీ నరేంద్ర మోడీ మాత్రం అలా కాదు. ఇప్పటికీ నిత్య యవ్వనుడిలాగే ఆయన కనిపిస్తున్నారు. దేశ ప్రధానిగా ఆయన 11 సంవత్సరాలుగా సేవలందిస్తున్నా ఇంతవరకు అనారోగ్యానికి గురి కాలేదు. ఆయనకు ఎటువంటి వ్యాధులు కూడా లేవు.
ప్రపంచ దేశాల అధినేతలు తరచూ విశ్రాంతి తీసుకుంటుంటే.. నరేంద్ర మోడీ మాత్రం ప్రపంచం మొత్తం చుట్టి వస్తున్నారు. ప్రపంచ దేశాలు అధినేతలతో మాట్లాడుతూ దౌత్యపరంగా భారతదేశాన్ని తిరుగులేని స్థాయిలో నిలబెడుతున్నారు. ప్రతి దేశంతోనే సామరస్యపూర్వకమైన వాతావరణాన్ని కొనసాగిస్తూ తిరుగులేని భారత నాయకుడిగా ఆయన కొనసాగుతున్నారు. వాస్తవానికి ఏడుపదుల వయసులో ఎవరైనా సరే అనారోగ్యానికి గురవుతుంటారు. సాధ్యమైనంతవరకు విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. కానీ నరేంద్ర మోడీ అలా కాదు వయస్సు కేవలం శరీరానికేనని.. మనసుకు కాదని.. తను ఇప్పటికీ నిత్య యవ్వనుడినని నిరూపించుకుంటున్నారు. కాలంతో పోటీ పడుతూ పనిచేసుకుంటూ పోతున్నారు. ఏమాత్రం అలసట అనేది లేకుండా.. ఏమాత్రం అనారోగ్య సమస్య అనేది శరీరాన్ని దరి చేరనివ్వకుండా పనిచేస్తున్నారు.
ఏడుపదుల వయసు దాటినప్పటికీ మోడీ ఇంత ఆరోగ్యంగా ఉండడానికి ప్రధాన కారణం యోగా. దాంతోపాటు ఉదయం లేవగానే ఆయన గోరువెచ్చని నీరు తాగుతారు. అందులో నిమ్మరసం, తేనె కలుపుకుంటారు. నవరాత్రుల సమయంలో ఆయన కేవలం నిమ్మరసం మాత్రమే తాగుతారు. నేల మీద పడుకుంటారు. ఎట్టి పరిస్థితిలోనూ ఆహారం తినరు. మిగతా సమయాల్లోనూ ఆయన మితంగానే ఆహారం తీసుకుంటారు. పొరపాటున కూడా మాంసాహారం జోలికి వెళ్లరు. ఉదయం పూట గుజరాత్ వంటకమైన టోలి చోకిలి తింటారు. మధ్యాహ్నం దంపుడు బియ్యంతో చేసిన అన్నం… సలాడ్.. శనిగలతో చేసిన కూరలను తింటారు. రాత్రిపూట సమయాన్నిబట్టి పుల్కా లేదా చపాతి తింటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నూనె పదార్థాలు తినరు. శరీరానికి హాని చేసే కొవ్వు పదార్థాలను దూరంగా ఉంచుతారు. వ్యాయామం చేయడానికి ఇష్టపడుతుంటారు. స్వతహాగానే అమ్మవారి ఉపాసకుడు కాబట్టి నరేంద్ర మోడీ ఆరోగ్యంగా ఉంటారు. అప్పుడప్పుడు బీహార్ నుంచి తెప్పించుకున్న మఖాన తింటుంటారు.