India GDP: భారత దేశం ప్రపంచంలో ఐదో ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. రాబోయే ఐదేళ్లలో మూడో స్థానానికి చేరుకుంటామని అంటున్నారు ప్రధాని మోదీ. ఈమేరకు ఆయన చర్యలు కూడా చేపడుతున్నారు. అయితే దేశ ఆర్థికాభివృద్ధిలో దేశంలోని పలు రాష్ట్రాలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. దేశ తలసరి ఆదాయాన్ని మించి ఆ రాష్ట్రాల తలసరి ఆదాయం ఉంది. దీంతో దేశ జీడీపీ వృద్ధిలో కూడా ఆ రాష్ట్రాలే కీలకంగా మారాయి. గతంలో దేశ ఆర్థికాభివృద్ధిలో మహారాష్ట్ర కీలకంగా ఉండేది. కానీ ఇటీవల ఆ దేశ తలసరి ఆదాయం క్రమంగా తగ్గుతోంది. దీంతో దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. దేశ జీడీపీలో 30 శాతం వాటా ఈ రాష్ట్రాలే కలిగి ఉన్నాయి. 1991 నాటి జాతీయ సగటుకన్నా ఎక్కువ. ఇక మహారాష్ట్ర వాటా 15 శాతం నుంచి 13.3 శాతానికి తగ్గింది.
అత్యంత సంపన్న రాష్ట్రాలు..
తలసరి ఆదాయంలో తెలంగాణ, ఢిల్లీ, హర్యాన దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. అత్యంత సంపన్న రాష్ట్రాలుగా నిలిచాయి. బిహార్, ఉత్తర ప్రదేశ్ అత్యల్ప జీడీపీతో చివరిస్థానంలో ఉన్నాయి. దీంతో దక్షిణాది రాష్ట్రాలే దేశ జీడీపీ వృద్ధికి దోహదం చేస్తున్నాయి. ఇక ప్రాంతీయ అసమానతలు పశ్చిమ బెంగాల్ వంటి పేద రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి. కర్ణాటక, కేరళ, తమిళనాడు వంటి రాస్ట్రాలు దక్షిణాదిలో గణనీయమైన ఆర్థిక పురోగమనాన్ని సాధించాయి.
తలసరి ఆదాయం ప్రకారం ధనిక రాష్ట్రాలు
2021, సెప్టెంబర్ 18న విడుదల చేసిన ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నివేదిక ప్రకారం.. జాతీయ సగటులో తలసరి ఆదాయం ఆధారంగా అత్యంత ధనిక రాష్ట్రాలుగా ఐదు రాష్ట్రాలు గుర్తింపు పొందాయి. 2014లో ఏర్పడిన తెలంగాణ అతి తక్కువ కాలంలోనే ధనిక రాష్ట్రాల్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఢిల్లీ, హర్యానా రెండు, మూడో స్థానంలో ఉన్నాయి. మహారాష్ట్ర, భారతదేశ జీడీపీలో కీలక కంట్రిబ్యూటర్‌గా మిగిలిపోయినప్పటికీ, తలసరి ఆదాయంలో మొదటి ఐదు స్థానాల్లో స్థానం పొందలేదు.
తెలంగాణ: 176.8%
ఢిల్లీ: 167.5%
హర్యానా: 176.8%
మహారాష్ట్ర: 150.7%
ఉత్తరాఖండ్: 145.5%
తలసరి ఆదాయం ప్రకారం పేద రాష్ట్రాలు
తలసరి ఆదాయం ప్రకారం భారతదేశంలో ఉత్తరప్రదేశ్, బీహార్ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలుగా ఉన్నప్పటికీ, జాతీయ సగటులో వరుసగా 43.8% మరియు 39.2% వద్ద అత్యల్ప తలసరి ఆదాయాన్ని కలిగి ఉన్నాయి.
బీహార్: 39.2%
ఉత్తరప్రదేశ్: 43.8%
మధ్యప్రదేశ్: 46.1%
రాజస్థాన్: 51.6%
ఛత్తీస్‌గఢ్: 52.3%
దేశ జీడీపీకి సహకారం
ఐదు దక్షిణాది రాష్ట్రాలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ మరియు తమిళనాడులు మార్చి 2024 నాటికి భారతదేశ జీడీపీలో 30% వాటాను కలిగి ఉన్నాయి, ఇది 1991లో జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది. పశ్చిమ బెంగాల్, ఒకప్పుడు 1960–61లో జీడీపీలో 10.5% వాటాను కలిగి ఉంది, ప్రస్తుతం స్థిరమైన క్షీణత కేవలం 5.6%కి చేరుకుంది. దాని తలసరి ఆదాయం కూడా జాతీయ సగటులో 127.5% నుంచి 83.7%కి పడిపోయింది, ఇది రాజస్థాన్, ఒడిశా వంటి రాష్ట్రాల కంటే తక్కువ. ఉత్తరప్రదేశ్ వాటా 1960–61లో 14% నుంచి 9.5%కి పడిపోయింది. బీహార్ మూడవ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా ఉన్నప్పటికీ 4.3% మాత్రమే అందించింది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More