
Outsource Employee Salaries: రాష్ట్రంలో దరిద్రపు పరిస్థితికి ఇదొక నిదర్శనం. అధికారంలోకి వచ్చాక తమ పరిస్థితి బాగుంటే చాలు అన్నట్లు వ్యవహరిస్తున్న వైసీపీ ప్రభుత్వం.. నిధులు ఏ రూపంలో ఉన్నా అవసరాలకు వాడేసుకుంటూ వస్తోంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నా లెక్క చేయడం లేదు. ఇప్పుడు పర్యాటక శాఖ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను వాడేసుకుంది. అరొకర జీతాలతో జీవితాలు నెట్టుకొస్తుండే వారి బ్యాంకు అకౌంట్లలో జీతాలు జమకాకపోవడంతో లబోదిబో మంటున్నారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చాక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ ఒక గాటన కట్టేసింది. వేర్వేరుగా కార్పొరేషన్లలో ఉన్నవారందరినీ రెడ్డి కార్పొరేషన్ అని ఏర్పాటు చేసి, దాని ద్వారా జీతాలు అందజేస్తుంది. అయితే, పర్యాటక శాఖకు ప్రత్యేకంగా నిధులు ఉంటాయి. ఇందులో ఎక్కువ మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే ఉంటారు. వారందరికీ ఆ శాఖ నుంచే గతంలో జీతాలు చెల్లింపులు జరిగేవి. ఇప్పుడు పర్యాటక శాఖ నుంచి రెడ్డి కార్పొరేషన్ కు నిధులు వెళ్తున్నాయి. ఈ నెల జీతాలను అలా పర్యాటక శాఖ అందజేసింది. వాటిని జమ చేయకుండా ప్రభుత్వం వాడేసుకోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగం పొందిన వారు ఎంతకాలం పనిచేసినా వారి జీతాలు 10 నుంచి 30 వేలలోపు మాత్రమే ఉంటాయి. ప్రస్తుతం పెరిగిన ధరల ప్రకారం ఏ నెల జీతం ఆ నెల అందితేనే కుటుంబాలు గడిచేది. పర్యాటక శాఖ ఉద్యోగుల జీతాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంపై ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉద్యోగులు దాచుకున్న డబ్బులను ప్రభుత్వం వాడుకోవడమంటే దోచుకోవడమేనని ఏపీ జేఏసీ అమరావతి నాయకులు ఆరోపిస్తున్నారు.
ప్రతి నెల అప్పుల మీదనే ఆధారపడ్డ వైసీపీ ప్రభుత్వం, మొన్నా మధ్య ప్రభుత్వ ఉన్నతాధికారులు ఢిల్లీకి వెళ్లి వచ్చిన వర్కవుట్ అవలేదు. అప్పు పెగలడం లేదు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను గట్టిగా అడగలేకపోతుంది. సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేయాల్సిన షెడ్యూల్ దాటిపోతుంది. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోను ఏపీ ప్రభుత్వం దుబారా ఖర్చులకు వెనుకాడట లేదు. మరోవైపు టూరిజం చైర్మన్ గా నియమితుడైన వర ప్రసాద్ రెడ్డి సంస్థ సొమ్ములను ఇష్టా రాజ్యంగా వాడేసుకుంటున్నాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి.