Tarakaratna- Arjun Kapoor
Tarakaratna- Arjun Kapoor: వరుస సూపర్ హిట్స్ తో కెరీర్ లో ఎన్నడూ లేనంత జోష్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతుంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా,యంగ్ బ్యూటీ శ్రీ లీల బాలయ్య కి చెల్లెలుగా నటిస్తుంది. బాలయ్య ని ఇందులో ఇది వరకు అభిమానులు మరియు ఆడియన్స్ ఎప్పుడూ చూడని పాత్రలో చూపించబోతున్నారు.
అయితే ఇందులో ఒక పవర్ ఫుల్ నెగటివ్ రోల్ ఉంది, ఈ రోల్ కి ముందుగా తారకరత్న ని తీసుకున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. బాలయ్య బాబు స్వయంగా ఈ పాత్ర తారకరత్న కి ఇవ్వాలని రికమెండ్ చేసాడట. బాలయ్య చెప్పినట్టుగానే ఇందులో తారకరత్న కి ఒక పవర్ ఫుల్ పాత్రని రాసాడట డైరెక్టర్ అనిల్ రావిపూడి. కానీ ఆయన అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి మరణించడం యావత్తు సినీ లోకాన్ని మరియు నందమూరి అభిమానులను శోక సంద్రం లోకి నెట్టేసింది.
అయితే ఇప్పుడు ఆ పాత్రని బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ చెయ్యబోతున్నట్టు సమాచారం.ఇటీవలే డైరెక్టర్ అనిల్ రావిపూడి అర్జున్ కపూర్ ని కలిసి కథ వినిపించగా, ఆయన వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.అంతే కాదు ఇంత పవర్ ఫుల్ రోల్ ని ఆఫర్ చేసినందుకు డైరెక్టర్ అనిల్ రావిపూడి కి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలియచేసాడట అర్జున్ కపూర్.
Tarakaratna
ఒకవేళ ఈ పాత్రని తారకరత్న చేసి ఉంటె ఆయన కెరీర్ కి ఎంతగానో ఉపయోగపడేది.గతం లో బాలయ్య సినిమా విలన్ గా నటించి ఇండియా లోనే మోస్ట్ వాంటెడ్ బిజీ క్యారక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాడు, తారకరత్న కి కూడా అలాంటి ఛాన్స్ ఉండేది.ఒకపక్క రాజకీయంగా ఎదుగుతూనే మరో పక్క కెరీర్ పరంగా కూడా దూసుకెళ్ళేవాడు, కానీ బ్యాడ్ లక్ కెరీర్ లో గొప్పగా స్థిరపడుతున్న సమయం లోనే అతనికి ఇలాంటిది జరిగింది.