Karnataka Government: కారు ఉంటే రేషన్ కట్.. రాష్ట్ర ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం..

కాంగ్రెస్ లో గత కొన్ని నెలల కిందట ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రకటించిన విషయం తెలిసిందే.

Written By: Chai Muchhata, Updated On : August 7, 2023 10:39 am

Karnataka Government

Follow us on

Karnataka Government: పేదవారి కడుపు నింపేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రప్రభుత్వం కలిసి రేషన్ బియ్యాన్ని అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఈ ఏడాది డిసెంబర్ వరకు ఉచితంగా ప్రతి ఒక్కరికి 5 కిలోల బియ్యాన్ని అందిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే తాజాగా కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డు పేదవారికి మాత్రమే అందించాలన్న ఉద్దేశంతో కొన్ని మార్పులు చేసింది. సొంతంగా కారు ఉంటే రేషన్ కార్డును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఉపాధి కోసం కొనుక్కున్న కారు ఉంటే మాత్రం వారికి మినహాయింపు ఇస్తున్నట్లు సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

కాంగ్రెస్ లో గత కొన్ని నెలల కిందట ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. తాజాగా రేషన్ కార్డు విషయంలోనూ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు హోదా కోంస కారు కొనుగోలు చేసి రేషన్ కార్డు కలిగి ఉన్నవారివి రద్దు చేస్తామని తెలిపింది.

కర్ణాటక రాష్ట్రంలో రేషన్ కార్డులు కలిగి ఉన్న అనర్హులను ఏరివేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి కే.హెచ్ మునియప్ప పేర్కొన్నారు. ఇందులో భాగంగా మొదట కారు ఉన్న వారిని తొలగిస్తామని తెలిపింది. ఇంట్లో వైట్ బోర్డు కారు ఉంటే బీపీఎల్ కార్డుకు అనర్హలని ఆయన అన్నారు. ఇప్పటి వరకు అలాంటి కార్డులు ఉంటే వాటిని తొలగిస్తామని, కొత్తగా ఇచ్చే వాటి విషయంలో ఇలాంటివి ఇవ్వబోమని అన్నారు.

కర్ణాటకలో ప్రస్తుతం కేంద్ర అందించే 5 కిలోల బియ్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరో 5 కిలోల కోసం నగదును అందిస్తోంది. ప్రస్తుతం బియ్యం కొరత కారణంగా బియ్యం అందించడం లేదు. సెప్టెంబర్ నుంచి 10 కిలోల బియ్యం పంపిణీ చేస్తామని ఆయన వివరించారు. అయితే ప్రస్తుతం బియ్యం కొరత కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి దిగుమతి చేసుకుంటామని అన్నారు. త్వరలో బియ్యంతో రాగి, జొన్నలు కూడా పంపిణీ చేస్తామని అన్నారు.