India Vs West Indies T20: వెస్టిండీస్ గడ్డపై టీమిండియా వరుస పరాజయాల పరంపరను కొనసాగిస్తుంది. మొన్న జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో పేలవమైన బ్యాటింగ్ కనబరిచి ఓడిపోయిన తర్వాత…ఇప్పుడు గయానాలో జరిగిన రెండవ టీ20 లో కూడా ఓటమిపాలైంది. మెరుగైన ప్రదర్శనతో సమిష్టిగా రాణించిన వెస్టిండీస్ జట్టు రెండు వికెట్ల తేడాతో భారత్ పై ఈ సిరీస్లో తన రెండవ విజయాన్ని నమోదు చేసుకుంది.
తొలుత బ్యాటింగ్ కి దిగిన టీం ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి కేవలం 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. బలమైన బ్యాటింగ్ లైన్ కలిగిన జట్టుకు 152 పరుగులు అనేది చాలా స్వల్పమైన స్కోర్ అని చెప్పవచ్చు. ఇన్ని మ్యాచ్లు జరుగుతున్న టీమ్ ఇండియన్ బ్యాటర్స్ మాత్రం తమ ప్రదర్శనలో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ కనబరచడం లేదు.
మొదటి టీ20 మ్యాచ్ లో వరుసగా రెండు సిక్సలతో తన ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్ ఖాతాను తెరిచిన తిలక్ వర్మ ఈ మ్యాచ్లో కూడా తన ప్రతిభ కనబరిచాడు. ఎదుర్కొన్న 41 బంతులను 5 ఫోర్లు, 5సిక్సులతో దూకుడుగా ఆడి 50 ఒక్క పరుగులు సాధించాడు. మొత్తం టీమ్ లో అతను ఒక్కడే హాఫ్ సెంచరీ చేసి రాణించిన ప్లేయర్ అంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించండి..
ఏళ్లకు తరబడి క్రికెట్ ఆడిన అనుభవం, ఎన్నో రికార్డులు నెలకొల్పిన జోరు త్వరలో ప్రపంచకప్ మొదలు కాబోతోంది అనగా ఎందుకు తగ్గుతోందో ఎవరికీ అంతుపట్టడం లేదు. టీం కెప్టెన్సీ వహిస్తున్న హార్దిక్ పాండ్యా 24 పరుగులు చేశాడు. ఇక ఇషాన్ కిషన్ 27 పరుగులతో సరిపెట్టుకోగా..శుభ్‌మన్ గిల్,సంజూ శాంసన్ చెరో ఏడు పరుగులు సాధించారు. మరో పక్క తన బ్యాట్ పవర్ చూపిస్తాడు అనుకున్న సూర్యకుమారి యాదవ్ ఒకే ఒక పరుగుతో సరిపెట్టుకున్నాడు.
ఆ తరువాత బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ కేవలం 18.5 ఓవర్లు పూర్తయ్యే టైం కి 155 పరుగులు చేసి విజయభావుట ఎగురవేసింది. వెస్టిండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్ 40 బంతులలో 6 ఫోర్లు ,4 సిక్సులు బాది 67 పరుగులు సాధించాడు. ఇతని విధ్వంసకరమైన హాఫ్ సెంచరీని అడ్డుకోవడం భారత్ బౌలర్లకు కష్టంగా మారింది. హార్దిక్ పాండ్యా 3 వికెట్లు తన ఖాతాలో వేసుకోగా..యుజ్వేంద్ర చాహల్ రెండు వికెట్లు రాబట్టాడు. ఇక అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్ చరో వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్ తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా టీం మేనేజ్మెంట్ పై అభిమానులు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. అతను చేసిన తప్పిదాల కారణంగానే టీమ్ ఇండియా పతనం వైపు అడుగు వేస్తోంది. ముఖ్యంగా అతను తీసుకున్న తప్పుడు నిర్ణయాలు వెస్టిండీస్ విజయానికి టీం ఇండియన్ పరాజయానికి కారణమయ్యాయి. పవర్ ప్లే టైం లో రవి బిష్ణోయ్‌కు బౌలింగ్ ఛాన్స్ ఇవ్వడం.. మరోపక్క చాహల్‌ను పూర్తి కోట బౌలింగ్కు ఉపయోగించుకోకపోవడం టీమ్ ఇండియాను ఒకరకంగా దెబ్బతీసాయి.
18 ఓవర్ జరిగే సమయంలో చాహల్‌కు బౌలింగ్ ఆస్కారం ఇచ్చి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది. 153 పరుగుల స్వల్పమైన స్కోర్ చేదించడం కోసం బరిలోకి దిగిన వెస్టిండీస్ కు స్టార్టింగ్ లోనే పెద్ద షాక్ తగిలింది. హార్దిక్ పాండ్యా వేసిన ఇన్నింగ్స్ తొలి బాల్ కి సూర్య కుమార్ సూపర్ క్యాచ్ తో ఓపెనర్ బ్రాండన్ కింగ్ డక్ ఔట్ అయ్యాడు. తరువాత క్రీజ్ లోకి వచ్చిన జాన్సన్ చార్లెస్ కూడా రెండు బంతులకి వెనక్కి తిరిగాడు. అలా మొదటి నాలుగు బంతులకే రెండు వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్ టీం తీవ్రమైన ఒత్తిడి కి గురి అయింది.
ఆ టైం కి టీమిండియా సమిష్టిగా కృషి చేసి కాస్త కట్టుదిట్టమైన బౌలింగ్ , ఫీల్డింగ్ చేసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ సరియైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా విఫలమయ్యాడనే చెప్పవచ్చు. మరోపక్క టీం ఇండియన్ బాటర్స్ కాస్త మెరుగైన ప్రదర్శన కనబరిచి ఉంటే స్కోర్ కనీసం 200 కి సులభంగా చేరేది. ఇదే పరంపర కొనసాగితే మాత్రం జరగబోయే ప్రతి మ్యాచ్ లో టీమిండియా విజయం కష్టమనే అనుకోవచ్చు.